Peanut Butter: 5 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన పీనట్ బటర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

Published : May 26, 2026, 05:11 PM IST

Peanut Butter: మార్కెట్‌లో దొరికే పీనట్ బటర్ కంటే ఇంట్లో తయారుచేసేది ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రిజర్వేటివ్స్ లేని ఈ పీనట్ బటర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
పీనట్ బటర్ ఎందుకు ఇంట్లోనే తయారు చేసుకోవాలి?

ఫిట్‌నెస్ లవర్స్, జిమ్‌కు వెళ్లేవారితో పాటు చాలా మంది తమ డైట్‌లో భాగంగా పీనట్ బటర్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అయితే, బయట మార్కెట్‌లో దొరికే పీనట్ బటర్‌లో రుచి కోసం లేదా నిల్వ ఉండటం కోసం చక్కెర, పలు రకాల ఆయిల్స్ తో పాటు హానికరమైన పదార్థాలను కలుపుతారు. ఇవి మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

ఇంట్లోనే పీనట్ బటర్ తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు లేకుండా మనం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. మీరు కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇంట్లో ఆరోగ్యకరమైన పీనట్ బటర్‌ను సిద్ధం చేసుకోవచ్చు.

24
పీనట్ బటర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి?

పీనట్ బటర్ తయారు చేయడం చాలా ఈజీ. దీనికి కేవలం నాలుగు ప్రధాన పదార్థాలు ఉంటే సరిపోతుంది. అవి..

• 2 కప్పుల వేరుశనగ గుళ్లు

• తగినంత ఉప్పు

• 1 చెంచా తేనె లేదా బెల్లం పొడి

• 1 నుండి 2 చెంచాల వంట నూనె లేదా నెయ్యి

34
పీనట్ బటర్ ను తయారు చేసే విధానం ఇదే

ముందుగా మీరు రెండు కప్పుల పచ్చి వేరుశనగలను తీసుకుంటే, వాటిని శుభ్రం చేసి ఒక కడాయిలో వేయించుకోవాలి. మంట మరీ ఎక్కువ లేకుండా సుమారు 5 నుండి 7 నిమిషాల పాటు వేయించండి. వేరుశనగ పొట్టు సులభంగా ఊడి వచ్చే వరకు వేయించుకోవాలి. వేరుశనగలు చల్లారిన తర్వాత, చేతులతో నలిపి పొట్టు పూర్తిగా తీసేయండి. పొట్టు ఉంటే పీనట్ బటర్ రంగు మారుతుంది. 

తర్వాత, ఒక హై-స్పీడ్ బ్లెండర్ లేదా ఫుడ్ ప్రాసెసర్‌ని తీసుకోండి. అందులో పొట్టు తీసిన వేరుశనగలను వేసి, సుమారు ఒక నిమిషం పాటు బ్లెండ్ చేయండి. మొదట వేరుశనగలు పౌడర్ లాగా కనిపిస్తాయి. బ్లెండర్‌ను ఆపి, అంచులకు అంటుకున్న పొడిని మధ్యలోకి అనుకుంటూ మళ్ళీ బ్లెండ్ చేయండి. ఇలా బ్లెండ్ చేస్తూ ఉంటే, వేరుశనగల్లో ఉండే సహజమైన నూనె బయటకు వస్తుంది. క్రమంగా అది మెత్తని పేస్టులాగా మారుతుంది.

పేస్ట్ క్రీమీగా తయారవుతున్నప్పుడు, అందులో రుచికి సరిపడా ఉప్పు, తేనె లేదా బెల్లం వేయండి. ఒకవేళ మిశ్రమం మరీ పొడిగా అనిపిస్తే, అదనంగా ఒక చెంచా నూనె లేదా నెయ్యిని కలపండి. మిశ్రమం పూర్తిగా క్రీమీ టెక్స్చర్‌లోకి వచ్చే వరకు బ్లెండ్ చేయండి. మీకు పీనట్ బటర్‌లో అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు కావాలనుకుంటే, చివరలో కొన్ని వేయించిన వేరుశనగలను వేసి ఒకసారి కలపండి.

44
పీనట్ బటర్ ను నిల్వ చేయడం ఎలా?

ఇలా తయారు చేసుకున్న పీనట్ బటర్‌ను మీరు గాలి తగలకుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఇది సాధారణంగా బయట పెట్టినా కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బ్రెడ్ స్లైస్‌పై రాసుకుని లేదా స్మూతీలలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తినిచ్చే పోషకాలు అందుతాయి.

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా మార్పులు చేసే ముందు నిపుణులైన వైద్యులను సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories