Kitchen Hack: ఉదయం లేచింది మొదలు..ఏం వంట చేయాలి? వంట త్వరగా ముగించాలి అనే కంగారు అందరికీ ఉంటుంది. అలా అని గంటలకొద్దీ వంటగదిలోనే గడపాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే తక్కువ టైమ్‌లోనే వంట పూర్తి చేసి పనిభారం తగ్గించుకోవచ్చు.
ఉల్లిపాయలు త్వరగా ఫ్రై కావాలంటే చాలామంది ఉప్పు వేసేస్తారు. దానికి ఇంకా ఈజీ ట్రిక్ ఉంది. నూనెలో ఉల్లిపాయలు వేసిన వెంటనే ఒక స్పూన్ నీళ్లు చల్లి మూత పెట్టండి. ఈ ఆవిరికే ఉల్లిపాయలు చాలా త్వరగా మెత్తబడుతూ గోల్డెన్ కలర్‌లోకి మారతాయి. దీంతో గ్యాస్, టైమ్ రెండూ సేవ్ అవుతాయి.
26
టమాటాలు మగ్గడానికి టైమ్ పడుతోందా?
టమాటాలు త్వరగా మెత్తబడక చాలా టైమ్ తీసుకుంటాయని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అందుకే ముందుగానే టమాటాలను కడిగి ఫ్రీజర్‌లో నిల్వ పెట్టండి. వండే ముందు కొన్ని నిమిషాలు నీళ్లలో వేస్తే తొక్క ఈజీగా ఊడిపోతుంది. తర్వాత టమాటాను నలిపి వేసేస్తే గ్రేవీ త్వరగా చిక్కగా తయారవుతుంది.
36
ఆకుకూరలకు కత్తిపీట వద్దు!
కొత్తిమీర, పుదీనా, మిగతా ఆకుకూరలను కత్తిపీటపై తరగాలంటే టైం పడుతుంది. అందుకే ఆకుకూరలు కట్ చేసేందుకు ప్రత్యేకంగా కత్తెరలు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని వాడితే పని చాలా ఈజీ అవుతుంది. ఆకుకూరలను గుత్తిగా పట్టుకుని నేరుగా కడాయిలోనే కట్ చేయొచ్చు. దీంతో టైమ్ సేవ్ అవ్వడంతో పాటు అదనంగా చాపింగ్ బోర్డులు, కత్తిపీటలు కడగాల్సిన పని కూడా ఉండదు.
వంటలో ఎక్కువ సమయం తీసుకునేది వెల్లుల్లి తొక్క తీయడమే. ఇకపై కష్టపడకుండా వెల్లుల్లి రెబ్బలను విడదీసి, గోరువెచ్చని నీటిలో 5 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత చేత్తో తేలికగా నొక్కితే, పొట్టు దానంతట అదే ఊడిపోతుంది. గోళ్లు నొప్పెట్టవు, పని కూడా పూర్తవుతుంది.
56
బంగాళదుంప 5 నిమిషాల్లో ఉడకాలంటే?
బంగాళదుంపలు కుక్కర్‌లో ఉడకడానికి 3-4 విజిల్స్ అవసరం. దానికి బదులుగా, దుంపలను కడిగి, ఫోర్క్ స్పూన్‌తో (Fork) అక్కడక్కడా గుచ్చండి. తర్వాత గిన్నెలో నీళ్లు పోసి మైక్రోవేవ్ ఓవెన్‌లో 5 నిమిషాలు పెట్టినా, లేదా కుక్కర్‌లో పెట్టినా, సగం సమయంలోనే మెత్తగా ఉడికిపోతాయి.
66
అల్లం వెల్లుల్లి 'ఐస్ క్యూబ్స్'!
రోజూ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరాలంటే బద్ధకంగా ఉందా? ఒకేసారి ఎక్కువగా నూరి, ఐస్ క్యూబ్ ట్రేలో (Ice Cube Tray) వేసి ఫ్రీజర్‌లో పెట్టండి. గడ్డకట్టాక తీసి ఒక కవర్‌లో వేసి నిల్వ చేసుకోవచ్చు. వంట చేసేటప్పుడు ఒక క్యూబ్ తీసి నూనెలో వేస్తే సరి. ఫ్రెష్‌గా కూడా ఉంటుంది.