రోగనిరోధక శక్తిని పెంచే అల్లం..
ప్రముఖ డైటీషియన్, డాక్టర్ భరద్వాజ్, ఆయుర్వేద నిపుణురాలు శ్వేతా తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిన్న అల్లం ముక్క తినడం వల్ల జీర్ణశక్తిని పెంచి, శరీరాన్ని జీవక్రియకు సిద్ధం చేస్తుంది. అల్లం నమలడం వల్ల లాలాజలం, జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అజీర్ణం, వికారం, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లంలో ఉండే జింజెరోల్, షోగోల్ అనే సమ్మేళనాలు కడుపు నొప్పి, ఉదయం వికారం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లా పనిచేస్తుంది. అంతేకాదు, అల్లం యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో నిండి ఉంటుంది. దీనివల్ల జలుబు, ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.