Health Tips: ఈ పండ్లు తిన్న తర్వాత వాటర్ అస్సలు తాగద్దు.. ఎందుకో తెలుసా?

Published : Jul 07, 2025, 06:57 PM IST

నీరు శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి ఏ పండ్లు తిన్న తర్వాత వాటర్ తాగకూడదో ఇక్కడ చూద్దాం.

PREV
17
పండ్లు తిన్నాక నీళ్ళు వద్దు
ఏ పండ్లు తిన్నాక వాటర్ తాగకూడదు?

ఆరోగ్యంగా ఉండడానికి ఫ్రూట్స్, వాటర్ చాలా అవసరం. అయితే కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు తిన్న తర్వాత నీళ్లు అస్సలు తాగకూడదట. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. మరి ఏ పండ్లు తిన్న తర్వాత వాటర్ తాగకూడదో ఇక్కడ చూద్దాం.

27
జామకాయ

చాలామంది జామపండు తినే ముందు కొద్దిగా ఉప్పు వేసుకుంటారు. ఉప్పు దప్పిక కలిగిస్తుంది కాబట్టి.. నీళ్లు తాగకుండా జాగ్రత్త పడండి. జామకాయ తిన్న వెంటనే వాటర్ తాగితే జీర్ణ సమస్యలు వస్తాయట. 

37
అరటిపండు

అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

47
ఆపిల్

ఆపిల్స్ లో పెక్టిన్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే గ్యాస్, అజీర్తి వంటి కడుపు సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, నీరసం కూడా కలుగుతాయి.

57
దానిమ్మ

దానిమ్మలో నీరు అధికంగా ఉంటుంది. దానిమ్మ తిన్న తర్వాత నీళ్లు తాగితే అసిడిటీ, వికారం వస్తుంది.

67
పుచ్చకాయ

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది అసిడిటీకి దారితీస్తుంది. కాబట్టి పుచ్చకాయ తిన్న తర్వాత వాటర్ తాగకపోవడమే మంచిది.

77
బొప్పాయి

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది. ఈ పండు తిన్న తర్వాత నీళ్లు తాగితే కొంతమందికి విరేచనాలు కావచ్చు.  

Read more Photos on
click me!

Recommended Stories