Face Glow: ఇవి రాత్రి పడుకునే ముందు రాత్రే.. ఉదయానికి ముఖం మెరవడం ఖాయం..!

Published : Jul 07, 2025, 02:30 PM IST

రాత్రికి రాత్రే మీరు అందంగా మెరిసిపోవాలని అనుకుంటున్నారా? అయితే…  కచ్చితంగా మీరు వీటిని ముఖానికి రాయాల్సిందే.

PREV
16
రాత్రికి రాత్రే అందంగా మెరిసిపోవాలంటే..

అందంగా కనిపించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? ఏం రాస్తే.. వయసు తగ్గి.. అందంగా కనిపిస్తామా అని ఎదురుచూస్తూ ఉంటారు. మార్కెట్లో ఏ ప్రొడక్ట్ వచ్చినా కొని, ముఖానికి వాడేసే వారు చాలా మంది ఉంటారు. కానీ.. వాటి వల్ల ఉపయోగం ఉంటుందో లేదో తెలీదు కానీ.. సహజంగా మనకు సులభంగా లభించే కొన్నింటిని రాస్తే మాత్రం కచ్చితంగా అందంగా మెరిసిపోతారు. అది కూడా రాత్రిపూట రాస్తే.. ఉదయానికి మీ ముఖం మెరుస్తూ కనపడుతుంది. మరి, అవేంటో తెలుసుకుందామా...

26
1.బాదం నూనె..

బాదం నూనె మన అందాన్ని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. దాదాపు అందరూ జుట్టు పెరగడం కోసం ఈ బాదం నూనె వాడుతూ ఉంటారు. కానీ, మన ముఖ సౌందర్యాన్ని పెంచడంలోనూ ఇది బాగా హెల్ప్ చేస్తుంది. మీరు రాత్రి పడుకునే ముందు కేవలం కొన్ని చుక్కల బాదం నూనె తీసుకొని.. ముఖానికి మంచిగా మసాజ్ చేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ముఖం లో గ్లో పెరుగుతుంది. ముఖం మృదువుగా మారుతుంది. ఫేస్ చాలా క్లియర్ గా మారుతుంది.

36
2.కలబంద జెల్..

కలబంద మన జుట్టుని ఎంత ఆరోగ్యంగా ఉంచుతుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే కలబంద మన అందాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది.మార్కెట్లొ దొరికే కలబంద జెల్ కాకుండా.. తాజా కలబంద గుజ్జును తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు.. ఈ గుజ్జు ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేసి.. అలానే వదిలేసి పడుకోవాలి. ఉదయం చూసే సరికి.. మీ చర్మంలో గ్లో వచ్చేస్తుంది. రెగ్యులర్ గా ట్రై చేయడం వల్ల.. మరింత మంచి ప్రయోజనాలు ఉంటాయి. చర్మం చాలా మృదువుగా మారుతుంది. మంచి అందాన్ని అందిస్తుంది.

46
3.పెరుగు..

పెరుగు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చే సహజమైన సౌందర్య సాధనం. ఇందులో ఉండే కాల్షియం, విటమిన్లు గట్ హెల్త్‌కి మాత్రమే కాకుండా, చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రాత్రి పడుకునే ముందు కొద్దిగా పెరుగు తీసుకుని ముఖానికి మృదువుగా మసాజ్ చేసి వదిలిపెట్టాలి. ఇది చర్మాన్ని ఆహ్లాదంగా ఉంచి, ఉదయానికి ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తుంది.

56
4.రోజ్ వాటర్, చందనం..

రోజ్ వాటర్ , చందనం కలిపిన ఫేస్ ప్యాక్ చర్మానికి మంచి గ్లో తెస్తుంది. ఈ రెండు పదార్థాలు చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. రోజ్ వాటర్ చర్మాన్ని శాంతిపరిచే లక్షణాలు కలిగి ఉండగా, చందనం చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా ఉంచుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10-15 నిమిషాలు వదిలి శుభ్రం చేసుకుంటే, మరుసటి రోజు ఉదయానికి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

66
5.పాలు..

పచ్చి పాలు కూడా ముఖ చర్మానికి మంచి టోనర్‌గా పనిచేస్తాయి. వాటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మలినాలను తొలగించడమే కాదు, ట్యాన్‌ను కూడా తక్కువ చేస్తుంది. రాత్రి పచ్చిపాలను కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేసి వదిలేస్తే, అది చర్మాన్ని శుభ్రపరచి ప్రకాశవంతంగా ఉంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories