Green Peas: చలికాలంలో పచ్చి బఠానీలు ఎందుకు తినాలి?

Published : Dec 09, 2025, 05:08 PM IST

Green Peas: కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కే లు పుష్కలంగా ఉండే బఠానీలు తినడం వల్ల ఎముకలు బలపడతాయి. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరి, వీటిని డైట్ లో ఎలా భాగం చేసుకోవాలి? 

PREV
14
green peas

చలికాలంలో మనకు చాలా సులభంగా లభించే వాటిలో బఠానీలు ముందు వరసలో ఉంటాయి. బఠానీలు మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్, ముఖ్యమైన విటమిన్లతో నిండిన సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. నిపుణుల ప్రకారం, ఈ పచ్చి బఠానీలు చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు.. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి సపోర్ట్ ఇస్తాయి. వీటిని తిన్నప్పుడు ఎక్కువ సేపు కడుపు నిండుగా కూడా ఉంటుంది. తద్వారా బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.

24
బఠానీల్లో పోషకాలు...

బఠానీల్లో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫోలేట్లు, ఫైబర్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

అధిక ప్రోటీన్..

బఠానీల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మొక్కల ఆధారంగా లభించే ప్రోటీన్ ఇది. అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. శాఖాహారులకు ఇది బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ గా భోజనంలో బఠానీలను చేర్చడం వల్ల ప్రోటీన్ లోపం ఉండదు. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

34
గుండె ఆరోగ్యం..

ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ తో నిండి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, మొత్తం గుండె ఆరోగ్యానికి సపోర్ట్ ఇస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, బఠానీలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

ఎముకల ఆరోగ్యం....

బఠానీల్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. వయసు పెరుగుతుంటే ఎముకలు బలహీనపడుతుంటాయి. కానీ, వీటిని తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

చెడు కొలెస్ట్రాల్ ( LDL) కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ , టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ బఠానీలు మీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. బఠానీలు డైటరీ ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. శరీరం చెడు కొలెస్ట్రాల్‌ను గ్రహించకుండా ఆపుతుంది, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

బరువు తగ్గించడంలో బఠానీ...

నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక ఫైబర్ , ప్రోటీన్ మెరుగైన సంతృప్తిని, ఎక్కువసేపు మిమ్మల్ని కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి. అనవసరమైన చిరుతిండిని తగ్గించడంలో సహాయపడుతుంది.

44
బఠానీలను ఆస్వాదించడానికి సులభమైన మార్గాలు

సులభంగా ఉడికించిన బఠానీలు: ఈ చిరుతిండి కోసం, 5–6 నిమిషాలు ఆవిరి మీద ఉడికించి, అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా చేర్చి కొద్దిగా, ఉప్పు కారం చల్లి, నిమ్మరసం పిండుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా కొద్దిగా నూనెతో వేయించి కూడా తీసుకోవచ్చు. లేదా.. కూరల్లో భాగం చేసుకొని అయినా తినవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories