ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు...
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు...
లివర్ లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. LDL ( చెడు కొలెస్ట్రాల్) పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. హృదయ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, హార్ట్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు చికెన్, మటన్ లివర్ లను పూర్తిగా దూరంగా ఉంచడమే మంచిది.
బీపీ, హైపరేటెన్షన్ ఉన్నవారు....
లివర్ లో సోడియం, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవారు రక్తపోటు సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే.. రక్తపోటు నియంత్రణలో లేనివారు ఈ ఆహారాన్ని తినకపోవడమే మంచిది.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు...
లివర్ లో ప్రోటీన్, ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల కిడ్నీలపై అధనపు ఒత్తిడి పడుతుంది. క్రియాటిన్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు.. చికెన్, మటన్ లివర్ లాంటివి తినకపోవడమే మంచిది.
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు...
మటన్, చికెన్ లివర్ లలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫీటస్ డెవలప్మెంట్ కు హాని కలిగిస్తుంది. హార్మోన్ అసమతుల్యతకు కారణం అవుతుంది. కాబట్టి, వైద్యుడి అనుమతి లేకుండా.. తీసుకోకూడదు.