Guava: జామపండు అంటే అందరికీ ఇష్టమైన పండు. ఇది రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే తియ్యని జామ కాయను ఎంచుకోవడం కాస్త కష్టమైన విషయమే. కానీ కొన్ని చిట్కాలు గుర్తుపెట్టుకుంటే బెస్ట్ జామ కాయలను పిక్ చేసుకోవచ్చు.
జామ రంగును బట్టి దాని రుచి ఎలాంటిదన్న విషయాన్ని గుర్తించవచ్చు. గాఢంగా పచ్చగా ఉన్న జామ అంటే అది ఇంకా మగ్గలేదని అర్థం చేసుకోవాలి. చాలా పసుపు లేదా పచ్చనారింజ రంగులో ఉంటే, అది ఎక్కువగా పండిపోయింది. లేత పచ్చ లేదా పల్చని పసుపు రంగులో ఉన్న జామే బాగుంటుంది. ఇది తియ్యగా ఉంటుందని అర్థం చేసుకోవాలి.
25
వాసన ద్వారా తెలుసుకోవచ్చు
తీపి జామకు సహజమైన తీయని వాసన ఉంటుంది. ముక్కు దగ్గర పెట్టుకుని గమనిస్తే వాసన తెలుస్తుంది. ఒకవేళ ఎలాంటి వాసన లేకపోతే ఆ జామ మగ్గలేదని అర్థం. ఒకవేళ మురిగినట్లు (చెడు వాసన) వస్తే అది పాడైపోయినట్లు అర్థం చేసుకోవాలి. తియ్యని వాసన వస్తే అదే తినడానికి పర్ఫెక్ట్ జామ.
35
చేతితో చెక్ చేయండి
జామను మెల్లగా వేళ్లతో నొక్కి చూడండి. చాలా గట్టిగా ఉంటే ఇంకా మగ్గలేదు. నొక్కగానే చేయి లోపలికి పోతే అది పాడైపోయినట్లు అర్థం. నొక్కితే కాస్త లోపలికి వెళ్లినట్లు అనిపిస్తే అది మంచి జామ కాయ అని అర్థం చేసుకోవాలి.
జామ ఎంచుకునేటప్పుడు మృదువుగా, మచ్చలు లేకుండా, చీలికలు లేని పండ్లను మాత్రమే ఎంచుకోవాలి. కోతలు లేదా గాయాలున్న జామల రుచి, వాసన రెండూ తగ్గుతాయి. అలాగే, గుండ్రంగా, సమానంగా ఉన్న జామలు సాధారణంగా తీపిగా ఉంటాయి.
55
తినే ముందు చిన్న చిట్కా
జామను ఎప్పుడూ చల్లని నీటితో కడిగి తినండి. దీనివల్ల దుమ్ము, పురుగుమందు అవశేషాలు తొలగిపోతాయి. మధ్యలో కోసి, అవసరమైతే గింజలు తీసేయండి. కొద్దిగా ఉప్పు, మిరప పొడి వేసుకుంటే రుచి రెండింతలు పెరుగుతుంది.