Millet Dosa: మిల్లెట్స్ దోశ, నార్మల్ దోశ రెండూ ఒకటేనా? కొంచెం కూడా ప్రయోజనం లేదా?

Published : Nov 05, 2025, 01:33 PM IST

Millet Dosa: మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. మిల్లెట్స్  ఎలా తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మరి, వీటిని ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

PREV
14
మిల్లెట్స్

ఈ వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యకంగా ఉండటమే పెద్ద సవాల్ గా మారింది. డయాబెటిస్, అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తెల్ల బియ్యానికి బదులుగా మిల్లెట్స్ ( రాగి, సజ్జ, కొర్ర, సామ, ఊదలు మొదలైనవి) లాంటివి తింటున్నారు. ఎందుకంటే, వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయి. దీంతో షుగర్ కంట్రోల్ లో ఉంటుందని, బరువు తగ్గడంలో సాయం చేస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే, ఇటీవల వైద్యులు చెబుతున్న విషయం ఏమిటంటే... మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ, వాటిని ఎలా తింటున్నాం, ఎలా వండుతున్నామో దానిపై ఆరోగ్య ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి.

24
మిల్లెట్స్ దోశ తింటున్నారా..?

వైట్ రైస్ అంత రుచిగా మిల్లెట్స్ ఉండవు అనేది నిజం. అందుకే.. అన్నం కి బదులు ఈ మిల్లెట్స్ తినడం కంటే.. ఇడ్లీ, దోశ రూపంలో తీసుకుంటే బెటర్ కదా అని చాలా మంది ఫీలౌతున్నారు. మరీ ముఖ్యంగా మిల్లెట్ దోశ, కేక్ లను ను చాలా మంది ఇష్టపడుతున్నారు. కానీ.. ఇలాంటి విధానాల్లో వండినప్పుడు మిల్లెట్స్ లోని సహజ ఫైబర్, పోషకాలు చాలా వరకు నష్టపోతాయి దోశ పిండి చేయడానికి మిల్లెట్స్ ని బాగా మెత్తగా రుబ్బుకుంటాం. అంతేకాకుండా.. దానిని పులియబెడతాం. ఈ విధానంలో గ్లెసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. అంటే... ఇవి కూడా బియ్యం లా చక్కెర స్థాయిలను త్వరగా పెంచగలవు.

ఇక ఈ మిల్లెట్స్ తో చేసిన పిండితో దోశ చేసేటప్పుడు నూనె కూడా వాడతాం. వండే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు వాడతాం. కాబట్టి, వాటి పోషక విలువలు తగ్గుతాయి. ఫలితంగా మనం మిల్లెట్స్ తింటున్నాం అనుకుంటాం.. కానీ.. వాటి పూర్తి ప్రయోజనాలు మనకు లభించవు.

34
మిల్లెట్స్ తినే సరైన పద్ధతి...

మిల్లెట్స్ ని అన్నంలా ఉడికించి తినడం ద్వారా వాటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అలా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదాహరణకు సామలు, కొర్రలు, బార్లీ, మిల్లెట్, రాగి జావ వంటి రూపాల్లో మిల్లెట్స్ ను తీసుకుంటే, శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

వైద్యుల సలహా ప్రకారం, రోజులో ఒక పూట అన్నానికి బదులుగా మిల్లెట్ రైస్ తీసుకోవడం శరీరానికి అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందిస్తుంది. మిల్లెట్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడంలో, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

44
మిల్లెట్స్ తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు....

మిల్లెట్స్ ను అధికంగా కాకుండా, మితంగా తినాలి. అంతేకాదు, వీటిని ఉడికించిన రూపంలో తీసుకోవాలి. ఫెర్మెంటేషన్ చేయడం లేదా బేక్ చేయడం వల్ల పోషకాలు తగ్గుతాయి. రోజుకి కనీసం ఒక పూట మిల్లెట్ రైస్ తినడం వల్ల శరీరానికి సహజ శక్తి లభిస్తుంది.

మొత్తానికి, మిల్లెట్స్ నిజంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వాటిని తినే విధానమే వాటి ప్రభావాన్ని నిర్ణయిస్తుంది. దోశగా కాకుండా, అన్నంలా ఉడికించి తినడం ద్వారా మాత్రమే వాటి అసలైన శక్తిని పొందగలం.

Read more Photos on
click me!

Recommended Stories