చాలా మంది అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఆకలి వేస్తే.. అప్పుడు మ్యాగీ తింటూ ఉంటారు. కానీ ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ మ్యాగీ తినడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి, డయాబెటిస్‌కు దారితీస్తుంది. సోడియం, ట్రాన్స్ ఫ్యాట్ పిల్లల్లో రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. పోషకాలు లేకపోవడం వల్ల మానసిక, శారీరక లోపాలు వస్తాయి. దీని వల్ల పిల్లలు ఊరికూరికే జబ్బుల బారిన పడుతూ ఉంటారు.