Pregnancy Diet : ప్రెగ్నెన్సీ టైంలో ఈ కూరగాయల్ని ఖచ్చితంగా తినాలి

Published : Oct 14, 2025, 10:46 AM IST

Pregnancy Diet : ప్రెగ్నెన్సీ టైంలో ఇవి తినకూడదు, అవి తినకూడదని పెద్దలు ఎన్నో ఆంక్షలు విధిస్తుంటారు. కానీ ఈ సమయంలో కడుపులో ఉన్న బిడ్డా, తల్లీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కొన్ని కూరగాయల్ని ఖచ్చితంగా తినాలి. 

PREV
16
మంచి ఆరోగ్యానికి తినాల్సిన కూరగాయలు

ప్రెగ్నెన్సీ సమయంలో మంచి పోషకాహారాన్ని తినడం చాలా అవసరం. ఎందుకంటే పోషకాలతోనే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. తల్లి కూడా హెల్తీగా ఉంటుంది. అందుకే గర్భిణులు రోజూ తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని కూరగాయల్ని ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ఇవి గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి.

26
ఆకుపచ్చని ఆకుకూరలు

ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గర్భిణులకు. ఈ కూరగాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, కాల్షియం, ఫైబర్, ఫోలెట్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి తల్లీ, బిడ్డ ఇద్దరినీ ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ పోషకాలు పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడతాయి. 

36
చిలగడదుంప

చిలగడదుంపలను ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి తల్లికి అవసరమైన శక్తని అందిస్తాయి. అలాగే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడతాయి.

 ఈ చిలగడదుంపలో ఉండే ఫోలెట్ శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే పుట్టుకతో వచ్చే లోపాలను నివారించేందుకు తోడ్పడుతుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎ గా మారి శిశువు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. 

46
బీట్‌రూట్

బీట్‌రూట్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్లు, ఫైబర్ లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. బీట్ రూట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. అలాగే అనిమియా వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే ఫోలెట్ శిశువు మెడదు,  స్పైనల్ కార్డ్ అభివృద్ధికి సహాయపడుతుంది.

అంతేకాదు దీనిలో ఉండే నైట్రేట్ గర్భిణులకు హైబీపీని తగ్గిస్తుంది. బీట్ రూట్ ను తింటే రక్తం శుద్ధి అవుతుంది. ట్యాక్సిన్స్ బయటకు పోతాయి. అంతేకాదు దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ గర్భిణులకు మలబద్దకం సమస్య నుంచి బయటపడేస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ C, మాంగనీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 

56
క్యాప్సికం

క్యాప్సికం గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. 

అలాగే శరీరంలో ఐరన్ శోషణకు సహాయపడుతుంది. అలాగే ఫోలెట్ శిశువు మెదడు, నరాల వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ కూరగాయలో ఉండే ఐరన్, పొటాషియం, కాల్షియం ఎముకల్ని బలంగా ఉంచడానికి శిశువు ఎదుగుదలకు తోడ్పడుతాయి. అంతేకాదు ఈ కూరగాయ రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. 

66
బ్రోకలీ

బ్రోకలీ కూడా గర్భిణులకు చాలా మంచిది. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్ వంటి ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి.ఇవి తల్లీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా బ్రోకలీని తినడం వల్ల గర్భిణులకు మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిలోని ఫోలెట్ మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories