అల్యూమినియం ఫాయిల్‌ లో ఈ ఫుడ్స్ ను అస్సలు పెట్టకూడదు

Published : Oct 12, 2025, 12:28 PM IST

Aluminum Foil: అల్యూమినియం ఫాయిల్ ను కిచెన్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ దీన్ని రోజూ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను దీంట్లో పెట్టకూడదు.

PREV
15
సిట్రస్ పండ్లు, కూరగాయలు

అల్యూమినియం ఫాయిల్ ను మనం ఎన్నో ఆహారాలను పెట్టడానికి వాడతాం. కానీ దీనిలో మాత్రం యాసిడ్ గుణమున్న ఆహారాలను పెట్టకూడదు. అంటే టమాటాలు, సిట్రస్ పండ్లు, కూరగాయలు, వెనిగర్ వంటివి అల్యూమినియం ఫాయిల్ లో పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే వీటిమధ్య రసాయన చర్య జరిగి ఆహారం పాడవుతుంది. 

25
మిగిలిపోయిన ఆహారాలు

అల్యూమినియం ఫాయిల్ లో ఆహారాలను పెట్టడం వల్ల అవి ఎక్కువ సేపు ఫ్రెష్ గా కనిపిస్తాయి. అందుకే చాలా మంది మిగిలిపోయిన ఆహారాలను దీంట్లో బాగా నిల్వ చేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి సమస్య లేదు. కానీ మిగిలిన ఆహారాలను ఎక్కువ రోజులు అల్యూమినియం ఫాయిల్ లో నిల్వ చేయడం మంచిది కాదు. ఎందుకంటే దీనిలో బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాడవుతుంది. 

35
బేకింగ్ చేయొద్దు

అల్యూమినియం ఫాయిల్ ను బేకింగ్ కు కూడా వాడుతుంటారు. నిజానికి ఇది వేడిని తొందరగా గ్రహిస్తుంది. కాబట్టి బేకింగ్ కు దీన్ని ఉపయోగించకూడదంటారు.

45
మైక్రోవేవ్ లో పెట్టకూడదు

అల్యూమినియం ఫాయిల్ లో ఫుడ్ ను పెట్టి మైక్రోవేవ్ లో పెట్టేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువ వేడికి గురైనప్పుడు స్పర్క్స్ వచ్చి ఫుడ్, పరికరం రెండూ పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మైక్రోవేవ్ లో అల్యూమినియం ఫాయిల్ ను పెట్టకూడదు. 

55
ఎక్కువ వేడి

అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగించి ఎక్కువ మంట మీద ఫుడ్ ను వేడి చేయకూడదు. ముందే ఇది వేడిని తొందరగా గ్రహిస్తుంది. కాబట్టి ఎక్కువ వేడి వద్ద మీరు ఫుడ్ ను కుక్ చేస్తే ఆహారం పాడవుతుంది. అలాగే ఇలాంటి ఆహారాలను తినడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. 

Read more Photos on
click me!

Recommended Stories