ఈ ఇంటి పనులు చేస్తే జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గుతారు
Weight Loss Tips: చాలా మందికి జిమ్ కు వెళ్లేంత టైం ఉండదు. మరి ఇలాంటి వారు బరువు తగ్గడం ఎలా అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. కానీ కొన్ని ఇంటి పనులు చేసినా మీరు జిమ్ కు వెళ్లకుండానే ఈజీగా బరువు తగ్గుతారు.

ఇంటి పనులు చేస్తూ బరువు తగ్గడమెలా
ఈ రోజుల్లో ఓవర్ వెయిట్ ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. చాలా మంది పెరిగిన బరువుతో ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడం వల్ల బాడీ షేప్ మారడమొక్కటే కాదు.. ఇది లేనిపోని రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా మన లైఫ్ టైం ను తగ్గిస్తుంది. అందుకే కొంతమంది వేలకు వేలు పోసి జిమ్ముకు వెళ్లి చెమటలు చిందిస్తుంటారు.
కానీ ప్రతి ఒక్కరికీ జిమ్ముకు వెళ్లి బరువు తగ్గించుకునేంత సమయం ఉండదు. మరి వీళ్లు బరువు తగ్గడమెలా అని డౌట్ రావొచ్చు. నిజం చెప్పాలంటే బరువు తగ్గాలంటే జిమ్ముకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కొన్ని పనులు చేసినా చాలా సులువుగా బరువు తగ్గుతారు. ఎందుకంటే ఆ పనులు కేలరీలను బర్న్ చేస్తాయి. మీరు బరువు పెరగకుండా చేస్తాయి.
ఇంటిని క్లీన్ చేయాలి
అవును మీరు ప్రతిరోజూ ఇంటిని, ఇంటి పరిసరాలను క్లీన్ చేసినా బరువు పెరగకుండా ఉంటారు. వెయిట్ లాస్ అవుతారు. ఇది మీ ఇంటిని నీట్ గా ఉంచడమే కాకుండా మీకు మంచి శారీరక శ్రమ కూడా అవుతుంది. ఇందుకోసం మీరు ప్రతిరోజూ మీ శరీరాన్ని చురుగ్గా ఉంచే ఇంటిని ఊడ్చడం, తుడుచుకోవడం, గిన్నెలు తోమడం వంటి పనులు చేస్తే ఈజీగా బరువు తగ్గుతారు. మీరు గనుక ఈ పనులను చేస్తే కేవలం అర్థగంటలో వంద నుంచి 150 కేలరీలను బర్న్ చేస్తారు. అంటే చేతులతో బట్టలు ఉతికితే 120 నుంచి 150 కేలరీలను బర్న్ చేస్తారు.
మెట్లను ఉపగించడం
చాలా మంది మెట్లు ఎక్కడానికి బదులుగా ఎలివేటర్ ను ఉపయోగిస్తుంటారు. కానీ మీరు మెట్లను ఎక్కి దిగితే మాత్రం చాలా సులువుగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా దీనివల్ల మీ కాళ్లు, తుంటి బలంగా అవుతాయి. అలాగే మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు రోజూ మెట్లను ఎక్కి దిగితే 200 నుంచి 300 కేలరీలు బర్న్ అవుతాయి.
తోటపని చేయాలి
తోట పని మీ మనస్సుకు ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా మీ శరీర బరువును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మొక్కల్లో కలుపును తీసేయడం, నీళ్లు పోయడం, కుండీల్లో మొక్కలను మార్చడం వంటి పనులు చేస్తే మీ శరీరం చురుగ్గా ఉంటుంది. దీనివల్ల మీరు బరువు కూడా తగ్గుతారు. రోజూ ఒక అర్థగంట పాటు గార్డెనింగ్ చేస్తే 150 నుంచి 200 కేలరీలు బర్న్ అవుతాయి.
వంట చేయడం
వంట చేసినా కూడా మీరు బరువు తగ్గుతారు. వంట చేస్తే బరువు తగ్గడమేంటని డౌట్ రావొచ్చు.. అంటే చేతులతో కూరగాయలు కట్ చేయడం, పిండి కలపడం, పాత్రలను క్లీన్ చేయడం వంటి పనులను నిలబడి చేస్తారు. మీకు తెలుసా కూర్చొని పనులను చేయడం కంటే నిలబడి పనులను చేస్తేనే ఎక్కువ కేలరీలు కరుగుతాయి. మీరు ప్రతి రోజూ 30 నిమిషాలు వంట చేయడం వల్ల 80 నుంచి 120 కేలరీలు బర్న్ అవుతాయి.
పిల్లలతో ఆడుకోవడం
మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారితో ఖచ్చితంగా ఆడుకోండి. దీనివల్ల మీరు వారితో టైం స్పెండ్ చేయడమే కాకుండా.. మీ బరువును కూడా తగ్గించుకున్నవారవుతారు. నిజానికి పిల్లలతో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. అలాగే దీనివల్ల కేలరీలు కూడా బర్న్ అవుతాయి. అంటే పిల్లలతో డ్యాన్స్ చేయడం, దాగుడుమూతలు ఆడుకోవడం వంటి పనుల వల్ల గంటకు 200 నుంచి 300 కేలరీలు కరుగుతాయి.
నడవడం
నడిస్తే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడాల్సి వస్తే గనుక కూర్చోకుండా అటూ ఇటూ నడుస్తూ మాట్లాడండి. దీనివల్ల మీ స్టెప్ కౌంట్ పెరుగుతుంది. అలాగే ఎక్స్ ట్రా కేలరీలు కూడా కరుగుతాయి. మీరు ప్రతిరోజూ 30 నిమిషాలు నడిస్తే వంద నుంచి 150 కేలరీలు కరుగుతాయి.
నడుస్తూ షాపింగ్ కు వెళ్లడం..
మీకు మార్కెట్ గనుక దగ్గర్లో ఉంటే బైక్ లేదా కారులో వెళ్లకుండా నడుచుకుంటూ వెళ్లండి. కొంచెం దూరం నడవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు, అలాగే ఇది మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. నిజానికి నడక మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.