Health Tips: 40 ఏళ్లు దాటినవారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసా?

Published : Aug 10, 2025, 03:21 PM IST

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో శక్తి తగ్గిపోతుంటుంది. మరీ ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారి శరీరంలో చాలామార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి వారు కొన్ని ఆహార పదార్థాలను కచ్చితంగా తినాలి. అవేంటో ఇక్కడ చూద్దాం. 

PREV
14
40 ఏళ్లు దాటినవారు తినాల్సిన ఫుడ్స్..

నలభై ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వయసులో శరీరంలో చాలా సమస్యలు రావచ్చు. వయసును బట్టి శరీరానికి పోషకాలు అవసరం. కొంతమంది ఎప్పుడూ ఒకే ఆహారపు అలవాట్లను పాటిస్తుంటారు. కానీ నిపుణుల ప్రకారం వయసును బట్టి వేర్వేరు ఆహారాలు తీసుకోవడం అవసరం. సాధారణంగా నలభై ఏళ్లు దాటిన తర్వాత శరీరం బలహీనంగా మారుతుంటుంది. కాబట్టి కొన్ని ఆహారాలు తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

24
కూరగాయలు, ఆకుకూరలు

కూరగాయలు, పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఫోలేట్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి రక్తహీనతను నివారించడానికి సహాయపడతాయి.

మిల్లెట్స్

గోధుమలు, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఓట్స్ వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో ఈ ఆహార పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయి.

34
ప్రోటీన్ ఫుడ్స్..

ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడంతో పాటు మానసిక ఉత్సాహానికి సహాయపడతాయి. కండరాల బలోపేతానికి తోడ్పడుతాయి. శనగలు, పెసలు, మినప పప్పు, మెంతులు, తులసి విత్తనాలు, బీన్స్, చికెన్, చేపలు, గుడ్లు వంటివి ప్రోటీన్ కి సహజ వనరులు. 

పాల ఉత్పత్తులు 

పాల ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా కాల్షియం లోపం రాకుండా నివారించవచ్చు. తక్కువ కొవ్వు కలిగిన పాలు, పెరుగు, పన్నీర్, బాదం పాల వంటివి తీసుకోవచ్చు. ఇవి ఎముకలు బలంగా మారేందుకు సహాయపడతాయి. అవిసె గింజలు, నువ్వులు, అవకాడో, బాదం, వాల్‌నట్స్ వంటి తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడుతుంది.  

44
సిట్రస్ పండ్లు

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నారింజ, జామ, సీతాఫలం, యాపిల్,  ద్రాక్ష, దానిమ్మ, బెర్రీలను తీసుకోవండ ద్వారా క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. 

నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు 

నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు శరీరాన్ని హైడ్రేట్ చేసి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. కొబ్బరి నీరు, పుచ్చకాయ, దోసకాయ, టమాటా, చిలకడదుంప, సూపుల వంటివి తీసుకోవచ్చు.

ఇవి కచ్చితంగా పాటించాలి!

ఎక్కువగా వేయించిన లేదా ప్రాసెస్డ్ ఆహారాలను తినకపోవడమే మంచిది.

రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. 

ఏదైనా సరే మితంగా తినాలి. కానీ పోషకాలు తగ్గకుండా చూసుకోవాలి. 

రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మర్చిపోవద్దు.  

Read more Photos on
click me!

Recommended Stories