Health: మీరు కూడా ఈ బ్లాక్ బాక్స్‌ల‌ను వంటింట్లో పెడుతున్నారా.? ఇది తెలిస్తే వెంట‌నే బ‌య‌ట‌ప‌డేస్తారు.

Published : Aug 08, 2025, 10:49 AM ISTUpdated : Aug 08, 2025, 10:51 AM IST

బిజీ జీవితంలో అన్ని ఇన్‌స్టాంట్ అవుతున్నాయి. ప్లాస్టిక్‌తో త‌యారు చేసే యూజ్ అండ్ త్రో వ‌స్తువులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిలో బ్లాక్ బాక్స్‌లు ఒక‌టి. అయితే ఇవి ఆరోగ్యంపై ఎలాంటి ప్ర‌భావం పడుతుందంటే..  

PREV
15
బ్లాక్ ప్లాస్టిక్‌ను ఎలా త‌యారు చేస్తారో తెలుసా.?

ప్ర‌స్తుతం బ్లాక్ బాక్స్‌ల వినియోగం భారీగా పెరిగింది. ఆన్‌లైన్‌లో ఏ ఫుడ్ ఆర్డ‌ర్ చేసినా ఇలాంటి బాక్సుల్లోనే డెలివ‌రీ చేస్తున్నారు. ఈ బాక్స్‌ల‌ను "బ్లాక్ ప్లాస్టిక్ష‌ తో త‌యారు చేస్తారు. వీటిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల రీసైకిలింగ్ ద్వారా ఇలాంటి బాక్స్‌ల‌ను త‌యారు చేస్తున్నారు. వీటి త‌యారీ స‌మ‌యంలో కొన్ని కెమికల్స్ (రసాయనాలు) క‌లుపుతుంటారు. వీటిలో కొన్ని ఫైర్‌ రెసిస్టెంట్‌గా ఉండటానికి ఉపయోగిస్తారు. ఇలాంటి బాక్సుల్లో నిల్వ చేసే ఆహార ప‌దార్థాల్లోకి ఆ కెమిక‌ల్స్ కలిసిపోతుంటాయి. ముఖ్యంగా వేడి, నూనెతో కూడిన లేదా ఆమ్లాహారాన్ని (ఆసిడిక్ ఫుడ్)ను నిల్వ చేసిన స‌మ‌యంలో ఈ ప్రమాదం ఎక్కువ‌గా ఉంటుంది.

DID YOU KNOW ?
కరగడానికి ఎంత సమయం పడుతుంది.?
ప్లాస్టిక్ భూమిలో పూర్తిగా కరగడానికి సాధారణంగా 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
25
ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.?

ఇలాంటి బ్లాక్ ప్లాస్టిక్స్ బాక్స్‌లో నిల్వ చేసిన ఫుడ్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఈ బ్లాక్ ప్లాస్టిక్ లో ఉండే కెమికల్స్ మన శరీర హార్మోన్‌లను గందరగోళానికి గురిచేస్తాయని ప‌లు అధ్యాయ‌నాలు చెబుతున్నాయి. ఇవి ఎండోక్రైన్‌ డిస్రప్టర్‌లు.. అంటే, మన హార్మోన్లను అనుకరించి శరీరంలోని సహజ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్, PCOD, థైరాయిడ్, ప్రాస్టేట్ సమస్యలు మొదలైన వాటికి కారణమయ్యే అవకాశముంది. ముఖ్యంగా "కార్బన్ బ్లాక్" అనే పదార్ధం.. ప్లాస్టిక్‌ను నలుపు రంగులోకి మార్చడానికి దీనిని ఉప‌యోగిస్తారు. ఇది క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు.

35
మైక్రోవేవ్ అస‌లే వ‌ద్దు

ఇక కేవ‌లం బ్లాక్ ప్లాస్టిక్స్ కంటైన‌ర్స్ మాత్ర‌మే కాకుండా ఇత‌ర క‌ల‌ర్స్‌లోవి కూడా ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కాద‌ని వైద్యులు అంటున్నారు. సాధారణ ప్లాస్టిక్ కంటైనర్లను కూడా వేడి లేదా చల్లటి ఆహార నిల్వకి ఉపయోగించక‌పోవ‌డ‌మే మంచిది. మ‌రీ ముఖ్యంగా ఈ బాక్స్‌ల‌ను మైక్రోవేవ్‌లో వేడి చేయడం చాలా ప్రమాదకరం. దీనివ‌ల్ల ప్లాస్టిక్‌లోని కెమికల్స్ ఆహారంలోకి కలిసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంగా ఇలా జరిగితే ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.

45
మ‌రి ఎలాంటివి ఉప‌యోగించాలి.?

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పలు సురక్షితమైన ఆప్ష‌న్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్ర‌ధాన‌మైన‌వి.. ఉక్కు (స్టీల్) పాత్రలు, గాజు (గ్లాస్) కంటైనర్లు, మట్టి (ఎర్తెన్‌వేర్) పాత్రలు (లీడ్ ఫ్రీ మట్టి, కెమికల్స్ లేకుండా తయారైనవి), ఆర‌టి ఆకులు, బాంబూ ప్లేట్లు వంటి వాటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు జ‌రుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

55
జీవ‌న‌శైలిలో మార్పులు త‌ప్ప‌నిస‌రి

ప్ర‌స్తుతం మారిన జీవ‌న విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కార‌ణంగా వ్యాధుల బారిన ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవాలంటే బయట ఆహారం తీసుకోవ‌డాన్ని వీలైనంత వ‌ర‌కు త‌గ్గించాలి. తాజా పండ్లు, కూర‌గాయ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణహిత ప్యాకేజింగ్ వ‌స్తువుల‌ను ఉప‌యోగించాలి. ముఖ్యంగా పిల్ల‌ల‌ను ప్లాస్టిక్‌కు దూరంగా ఉంచాలి. మైక్రోప్లాస్టిక్‌ల వల్ల మానసిక వికాసంలో ఆటంకం క‌లిగే అవ‌కాశం ల‌భిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories