వేసవిలో డిమాండ్ ఉండే పండ్లల్లో పుచ్చకాయ ముందు ఉంటుంది. పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? పుచ్చకాయ రోజూ తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఎండకాలం వచ్చిందంటే చాలు.. కుప్పలు తెప్పలుగా పుచ్చకాయలు కనిపిస్తూనే ఉంటాయి. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరే ఉంటుంది. కాబట్టి ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా.. అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. అయితే పుచ్చకాయ ఎప్పుడు తినాలి? ఎంత మోతాదులో తినాలి? రోజూ తింటే ఏమవుతుంది? ఇతర విషయాలు మీకోసం. ఓసారి చూసేయండి.
27
పుచ్చకాయ ఎప్పుడు తినాలి?
పుచ్చకాయలో లైకోపీన్, అమైనో ఆమ్లాలు, విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు. కాబట్టి పుచ్చకాయను రోజువారీ ఆహారంలో జ్యూస్‌గా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తినడం మంచిది కాదు. నిపుణుల ప్రకారం బ్రేక్ ఫాస్ట్ లేదా భోజనం తర్వాత ఒక ముక్క పుచ్చకాయ తినచ్చు.
37
పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు?
వేసవిలో నీరు మాత్రమే కాదు.. పండ్లు కూడా శరీరానికి చాలా అవసరం. పుచ్చకాయలో విటమిన్ ఎ, సి, పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
47
గుండె ఆరోగ్యానికి
పుచ్చకాయలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో అర్జినైన్‌గా మార్చబడతాయి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పుచ్చకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వేడి కారణంగా హార్ట్ పేషెంట్స్ ఎప్పుడైనా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. పుచ్చకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది.
57
మెరిసే చర్మానికి..
పుచ్చకాయలో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుతాయి. విటమిన్ ఎ సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పుచ్చకాయ చర్మ ముడతలను తగ్గిస్తుంది. పొడి చర్మాన్ని నివారిస్తుంది.
67
రోగనిరోధక శక్తి
పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది అంటు వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. వేసవిలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
77
జీర్ణ సమస్యలు
వేడి కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడి జీర్ణ సమస్యలు, మలబద్ధకం వస్తాయి. పుచ్చకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించడం సులభం అవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.