Cashew: జీడిపప్పు తినడం ఇష్టమా..? రోజుకి ఎన్ని తినాలో తెలుసా?

Published : Nov 27, 2025, 03:19 PM IST

Cashew:  జీడిపప్పు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది. మరి, అలాంటి జీడిపప్పును రోజుకి ఎన్ని తినాలో తెలుసా? వీటిని ఎలా తినాలి? ఒకవేళ జీడిపప్పు  ఎక్కువ తింటే ఏమౌతుంది? 

PREV
15
Cashew

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, శక్తిని పెంచడానికి, రుచిని పెంచడానికి జీడిపప్పును మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు, ఎండు ద్రాక్షల రుచిని అందరూ ఇష్టపడతారు. జీడిపప్పును చాలా రకాలుగా తింటారు. ఎక్కువ మంది స్నాక్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. ఉప్పు, కారం కలిపితే రుచి రెట్టింపు అవుతుంది. అయితే... ఈ జీడిపప్పును రోజుకి ఎన్ని తినాలి? వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం....

25
రోజుకి ఎన్ని జీడిపప్పులు తినాలి?

జీడిపప్పులు చాలా రుచిగా ఉంటాయి. దీంతో...వాటిని తినడం మొదలుపెడితే ఆపేయాలి అనిపించదు. కాబట్టి.. తింటూనే ఉంటారు. కానీ, అలా ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరం. కాబట్టి... చాలా తక్కువ పరిమాణంలో జీడిపప్పు తినాలి. మీరు రోజుకి 3 నుంచి 4 జీడిపప్పుల తినాలి. పిల్లలకు అయితే రోజుకి 2 జీడిపప్పులు ఇవ్వొచ్చు.

35
జీడిపప్పు ఎలా తినాలి..?

మీరు జీడిపప్పును పచ్చిగా తినవచ్చు. రుచిని పెంచడానికి, మీరు జీడిపప్పును తేలికగా వేయించి, ఉప్పు కలిపిన జీడిపప్పును తినవచ్చు. పిల్లలకు తేనెతో జీడిపప్పును తినిపించండి. తేనె తో కలిపి జీడిపప్పు తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు కూడా బరువు పెరుగుతారు. తేనె, జీడిపప్పు తినడం వల్ల కడుపు , జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అవి ఆరోగ్యకరమైన కొవ్వులు , యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.

45
జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు...

ప్రతిరోజూ జీడిపప్పు తినడం వల్ల శరీరంలో జింక్ లోపాన్ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. జీడిపప్పు గుండెకు కూడా మేలు చేస్తుంది. వాటిని తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. జీడిపప్పులో విటమిన్ E కూడా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. జీడిపప్పు జీర్ణక్రియ , కడుపుకు మంచిదని భావిస్తారు. వాటిలో డైటరీ ఫైబర్ ఉన్నందున అవి జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి. జీడిపప్పు తినడం వల్ల శరీరానికి సమృద్ధిగా కాల్షియం , మంచి మొత్తంలో మెగ్నీషియం లభిస్తుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. జీడిపప్పు మెదడు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. జీడిపప్పులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

55
జీడిపప్పులు ఎక్కువగా తింటే ఏమౌతుంది..?

బరువు పెరగడం: అధిక కేలరీల కంటెంట్ కారణంగా, పెద్ద మొత్తంలో జీడిపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు.

జీర్ణ సమస్యలు: ఇతర గింజల మాదిరిగానే, జీడిపప్పులో ఆహార ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ఒకేసారి ఎక్కువ జీడిపప్పులను తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు వస్తాయి, ముఖ్యంగా మీ జీర్ణవ్యవస్థ అధిక ఫైబర్ ఆహారాలకు అలవాటుపడకపోతే.. ఇంకా ఎక్కువ ఇబ్బందిపడతారు. కాబట్టి, మితంగా తినాలి.

Read more Photos on
click me!

Recommended Stories