Leftover Rice: రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పారేస్తున్నారా? కానీ.. ఈ మిగిలిపోయిన అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఉందో తెలుసా? దీనిని ఎలా తింటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయో తెలుసా?
ప్రస్తుత రోజుల్లో నిండా 30 ఏళ్లు కూడా దాటనివారికి కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు మన పూర్వీకులు 70 ఏళ్లు వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి కావు. దాని వెనక వారి ఆహారపు అలవాట్లే కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా దాదాపు మన పూర్వీకులు రాత్రి వండిన ఆహారాన్ని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో తినేవారు. మనలాగా ప్రతిరోజూ ఇడ్లీ, దోశలు, బ్రెడ్ లాంటివి ఏమీ తినేవాళ్లు కాదు. మరి.. వాళ్లకు లాగానే.. మనం కూడా ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ లో చద్దన్నం తింటే ఏమౌతుంది? మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం....
24
చద్దన్నం అంటే ఏంటి..?
ఈ చద్దాన్నాన్ని ఈ మధ్య చాలా మంది ఫర్మెంటెడ్ రైస్ అని పిలుస్తున్నారు. అంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని కొద్దిగా నీటిలో నానపెట్టి.. ఉదయాన్నే అందులో ఒక స్పూన్ పెరుగు కలిపి తింటారు. రాత్రంతా నానపెట్టి తినడం వల్ల విటమిన్ బి, ప్రోబయోటిక్స్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పెరుగుతాయి.
34
ఈ చద్దన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు...
మంచి విటమిన్లు, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండే ఈ చద్దన్నం తినడం వల్ల చాలా అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మరీ ముఖ్యంగా శరీరంలో వేడి తగ్గుతుంది. అంతేకాదు... నీరసం ఉండదు. రోజంతా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. అలసట అనేదే ఉండదు. వీటిలో ఉండే ప్రో బయోటిక్స్ కడుపులో మంచి బాక్టీరియా పెంచుతుంది. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణ సమస్యలు, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. డీ హైడ్రేషన్ సమస్య ఉండదు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మంచిది. ఈ అన్నానికి పెరుగు, మజ్జిగ, ఉల్లిపాయ లాంటివి కలిపి తింటే రుచికి రుచితో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే... బ్లడ్ షుగర్ ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.