భారతదేశంలో చాలా మందికి టీ లేదా కాఫీ లేకుండా రోజు మొదలవడం అసాధ్యం. టీ కేవలం పానీయం కాదు, రోజును ప్రారంభించడంలో ఇది ఒక ముఖ్యమైన భాగం. చాలా ఇళ్లలో పాల టీ మొదటి ఎంపిక. పాల టీ చేసేటప్పుడు చక్కెర( పంచదార) కలపడం కూడా మామూలే. దీనివల్ల టీ మరింత తియ్యగా ఉంటుంది. కానీ తీపి కోసం మీరు టీలో కలిపే చక్కెర ఆరోగ్యం, చర్మంపై ప్రభావం చూపుతుంది.
ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే… టీ తాగడం మానేయడం ఒక్కటే పరిష్కారం అని చాలా మంది అనుకుంటారు. కానీ, టీ లో చిన్న మార్పులు చేసుకుంటే.. హ్యాపీగా దానిని ఆస్వాదించవచ్చు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, మీరు రోజూ టీ తాగితే, దాన్ని లైట్‌గా తాగడానికి ప్రయత్నించండి. అంటే చక్కెర లేకుండా లేదా తక్కువ చక్కెరతో తాగాలి. ఇలా తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.