Beauty Tips: అందంగా కనపడాలని రోజూ కంటికి కాజల్ పెడుతున్నారా?

Published : Oct 24, 2025, 01:39 PM IST

Beauty Tips: ముఖ సౌందర్యాన్ని పెంచడానికి చాలా మంది ఐలైనర్ , కాజల్ లాంటివి వాడుతున్నారు. వీటితో అందం రెట్టింపు అవుతుంది నిజమే, కానీ, వాటి వల్ల చాలా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా? 

PREV
13
బ్యూటీ టిప్స్..

ఈ రోజుల్లో మేకప్ అనేది చాలా కామన్ విషయం అయిపోయింది. మరీ ముఖ్యంగా కాలేజీలకు, ఆఫీస్ లకు వెళ్లే చాలా మంది అమ్మాయిలు మేకప్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం లేదు. ఈ మేకప్ లో భాగంగానే కంటికి కాజల్, ఐలైనర్ వంటివి పెట్టుకుంటూ ఉంటారు. కానీ, వాటిని రోజూ పెట్టుకోవడం వల్ల మీ కళ్లు డ్యామేజ్ అవుతాయని మీకు తెలుసా? అసలు.. రోజూ కాజల్, ఐలైనర్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

23
కాజల్, ఐలైనర్ కంటికి ప్రమాదమా?

కాజల్, ఐలైనర్ ను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కంటికి ఎక్కువ డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది.. స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆరుషి సూరి సోషల్ మీడియాలో షేర్ చేశారు. రోజూ మేకప్ వేసుకోకపోయినా... కంటికి మాత్రం కాజల్ అప్లై చేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం అని డాక్టర్ తన వీడియోలో వివరించారు.

కాజల్ ,ఐలైనర్ కళ్ళ తో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కంటికి పెట్టుకున్న తర్వాత... రాత్రికి వాటిని తీసేయాలి. అంతేకాదు.. గడువు ముగిసిన ఉత్పత్తులను పొరపాటున కూడా ఉపయోగించకూడదు. లేకపోతే, బ్యాక్టీరియా , ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కళ్ళు ఎర్రబడటం, దురద , నీరు కారడం వంటి సమస్యలను పెంచుతుంది.

33
ఐలైనర్‌లో రసాయనాలు

కాజల్ , లైనర్‌లోని రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. మనం వీటిని రోజూ ఉపయోగించడం వల్ల కంటి అలెర్జీలు, చికాకు , వాపుకు దారితీస్తుంది. మీరు దీన్ని ప్రతిరోజూ అప్లై చేస్తే, అది క్రమంగా కళ్ళ ఉపరితలంపై, వెంట్రుకల ఫోలికల్స్‌లో పేరుకుపోతుంది. ఇది కార్నియాకు హాని కలిగించవచ్చు. అందుకే... కాజల్, ఐలైనర్ లాంటివి వాడినా కూడా.. రాత్రి మర్చిపోకుండా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే.. మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని తొలగించడానికి మీరు మేకప్ రిమూవర్ ని వాడొచ్చు. అంతేకాదు.. మీరు వాడే కాజల్ మంచి బ్రాండెడ్ కంపెనీకి వాడటం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories