Dosa : తెలుగోళ్ల దోసెలు మస్తు మాస్ గురూ... వీటికి తమిళ, కర్ణాటక స్టైల్ దోసెలకు తేడా ఏంటి?

Published : Apr 05, 2025, 12:00 PM ISTUpdated : Apr 05, 2025, 12:05 PM IST

దోసె... ఇది దక్షిణాది ప్రజల జీవితంలో భాగమైన వంటకం. దీన్ని టిఫిన్ గానే కాదు లంచ్ గా, డిన్నర్ గా తినేవారు కూడా ఉన్నారనడం అతిశయోక్తి కాదు. ఇలా దక్షిణ భారతదేశంలో బాగా ఫేమస్ అయిన వీటిలో తెలుగోళ్ల స్టైల్ దోసెలు ఎలా ఉంటాయి? తమిళులు, కన్నడిగుల స్టైల్ దోసెలు ఎలా ఉంటాయి? వేటి రుచి బాగుంటుంది? ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
Dosa : తెలుగోళ్ల దోసెలు మస్తు మాస్ గురూ... వీటికి తమిళ, కర్ణాటక స్టైల్ దోసెలకు తేడా ఏంటి?
Dosa

Dosa : భారతదేశం విభిన్న ఆచారాలు, సంస్కృతులకు నిలయం. ఒక్కో రాష్ట్రంలో ప్రజల జీవన విధానం ఒక్కోలా ఉంటుంది.  ఆచారాలే కాదు అహార అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. దక్షిణాది విషయానికే వస్తే ఉన్నదే నాలుగైదు రాష్ట్రాలు... కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అహార అలవాట్లు ఉన్నాయి. అంతెందుకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల మధ్య అహార అలవాట్ల విషయంలో చాలా తేడా ఉంటుంది.  కానీ దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కనిపించే అహారం ఒకటుంది... అదే దోసె. 

దక్షిణాది రాష్ట్రాల్లో దోసె అంటే ఇష్టపడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ కీర్తి సురేష్ మీకు ఏ అహారం ఇష్టమంటే దోసె అని చెబుతుంది... దేనితో పోల్చినా ఆమె నోటివెంట దోసె అనే పదమే వస్తుంది... దక్షిణాది ప్రజలు దోసెను ఎంతలా ఇష్టపడతారో చెప్పడానికి ఇదే నిదర్శనం. పెనంపై దోరగా కాల్చిన దోసె ప్లేట్ లో పడితే ఎంత అనందమో...  ఈ దోసెను చట్నీతో కలిపి నోట్లో వేసుకుంటే ఆహా ఆ రుచే వేరు.  

అయితే ఒక్కో రాష్ట్రంలో దోసెల రకాలు, టేస్టులు వేరువేరుగా ఉంటాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఓరకమైన దోసెలు ఉంటే కర్ణాటక, తమిళనాడులో మరో రకం దోసెలు ఉంటాయి. ఇలా వివిధ రాష్ట్రాల్లో లభించే దోసెల మధ్య తేడా ఏమిటి?  ఎక్కడ రుచికరమైన దోసెలు లభిస్తాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

 

25
Tamilnadu Dosa

తమిళనాడు దోసె : 

 దోసె అనేది దక్షిణ భారతదేశ ఆహార సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఉదయం టిఫిన్ గానే కాదు మద్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ లో కూడా దోసె తినేవారు దక్షిణాదిలో చాలామంది ఉన్నారు... అంతలా ఇక్కడి ప్రజలు దీన్ని ఇష్టపడతారు. ఈ దోసెను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు... నెయ్యి, పొడి దోసె నుంచి పనీర్ దోసె వరకు అనేక రకాల దోసెలు ఉన్నాయి.  ప్రతి రాష్ట్రానికి దోసె చేసే విధానంలో ప్రత్యేకత ఉంది. రుచి, వడ్డించే విధానం వల్లకూడా దోసెల టేస్ట్ మారుతుంది. 

దక్షిణాదిలో దోసెలకు తమిళనాడు చాలా ఫేమస్. ఇక్కడ దోసె అనేది చాలా పురాతనమైన సాంప్రదాయ ఆహారం. బియ్యం మరియు మినపప్పు కలిపి రాత్రంతా పులియబెట్టిన పిండితో దీన్ని తయారు చేస్తారు. దీనివల్ల దోసెకు సహజమైన పుల్లటి రుచి వస్తుంది.

తమిళనాడులో ఫేమస్ దోసెలు:

సాదా దోసె: మృదువుగా, పెద్దదిగా, కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది.
కల్ దోసె: దళసరి దోసె రకం. చెన్నైలో ప్రసిద్ధి చెందింది.
పనీర్ దోసె: దోసెలో పనీర్ కలిపి ఇస్తారు. ఇది ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది.
కారం దోసె: కారంగా ఉండే మసాలా కలిపిన దోసె. 

రుచి, ఇతర ప్రత్యేకతలు :

పుల్లని, మృదువైన, చక్కటి దోసె
రెస్టారెంట్లలో చిక్కటి సాంబార్, చట్నీలతో వడ్డిస్తారు
క్రిస్పీ దోసెను ఇష్టపడేవారికి ఉత్తమ ఎంపిక
 

35
Karnataka Dosa

కర్ణాటక దోసె :

కర్ణాటకలో దోసెకు వెన్నెను చేర్చడం చాలా ప్రసిద్ధి చెందినది. మైసూర్ మసాలా దోసె మరియు బెన్నె దోసె (Benne Dosa) పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ఆహారం, రాష్ట్రం యొక్క గుర్తింపు ఆహారంగా మారిపోయింది.

కర్ణాటకలోని ఫేమస్ దోసెలు:

బెన్నె దోసె: వెన్న పూసి, కొద్దిగా మందంగా ఉంటుంది. మైసూర్‌లో చాలా ప్రసిద్ధి చెందింది.
మసాలా దోసె: మైసూర్ మసాలా దోసెలో ప్రత్యేకంగా రంగురంగుల కారపు మసాలా అంతర్భాగంగా ఉంటుంది.
నీర్ దోసె: చాలా పలుచగా, వేడిగా వడ్డించే దోసె. తీర ప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది.
రవ్వ దోసె: బియ్యం పిండి కలపకుండా రవ్వతో తయారు చేసిన దోసె.

రుచి, ఇతర ప్రత్యేకతలు:

వెన్నెను చేర్చి ఉంటారు, చాలా రుచికరమైన దోసెలు
చిన్న పరిమాణంలో చాలా గుండ్రంగా, మృదువుగా ఉంటుంది
కారంగా ఉండే మసాలా చేర్చిన మైసూర్ మసాలా దోసె చాలా ప్రసిద్ధి చెందినది
 

45
Andhra Pradesh and Telangana Style Dosa

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ స్టైల్ దోసె : 

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో కూడా దోసె చాలా ఫేమస్ టిఫిన్. ఇక్కడి దోసెలో ఎక్కువ కారంగా ఉంటాయి. తెలుగోళ్ల ఆహార సంస్కృతి సాధారణంగానే కారంగా ఉంటుంది... కాబట్టి ఇక్కడి దోసెలు విభిన్నంగా ఉంటాయి. ఇక్కడి దోసెల్లో కారంగా ఉండే పల్లిపూరి, పచ్చిమిరపకాయ, మరియు ఊరగాయ మసాలా వంటివి ఉపయోగిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ దోసెలు:

కరివేపాకు దోసె: సహజమైన ఆయుర్వేద పదార్థాలు చేర్చి ఉంటారు.
పల్లిపూరి దోసె: ఊరగాయ మరియు మసాలా కలిపి చేసే ఒక రకం.
కారం మసాలా దోసె: పచ్చిమిరపకాయ మరియు కారంతో చేస్తారు.
నెయ్యి దోసె: నెయ్యి ఎక్కువగా చేర్చి ఉంటారు, ఇది రుచిని పెంచుతుంది.
ఆనియన్ దోసె : కేవలం సన్నగా తరిగిన ఉల్లిపాయలు దట్టించిన దోసె 
ఎగ్ దోసె : దోసెపై ఆమ్లెట్ మాదిరిగా గుడ్డును చేర్చే దోసె

రుచి, ఇతర ప్రత్యేకతలు:

కారంగా ఉండే ఆహారం ఇష్టపడేవారికి ఉత్తమ ఎంపిక
చాలా పెద్ద పరిమాణంలో వడ్డిస్తారు
ఊరగాయ మరియు కారంగా ఉండే కూరతో వడ్డిస్తారు

55
Dosa

తెలుగు, తమిళ, కన్నడ దోసెల్లో ఏది టేస్టీ...  

దోసె యొక్క ఉత్తమమైన వెర్షన్‌ను ఎంచుకోవడం అనేది ఆహారం యొక్క రుచికి సంబంధించిన వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. చక్కటి, సాంప్రదాయ పుల్లటి రుచి దోసెను ఇష్టపడేవారు తమిళనాడును ఎంచుకోవచ్చు. క్రిస్పీగా, వెన్నను చేర్చిన మైసూర్ మసాలా దోసెను ఇష్టపడేవారు కర్ణాటకను ఎంచుకోవచ్చు. ఎక్కువ కారంగా, నోటికి రుచినిఅందించే మసాలా దోసెను ఇష్టపడేవారు తెలుగు రాష్ట్రాల్లోని దోసెను ఎంచుకోవచ్చు.


 

Read more Photos on
click me!

Recommended Stories