కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగితే మరీ అంత డేంజరా? జాగ్రత్త బాస్!

Published : Apr 05, 2025, 05:44 PM IST

కొబ్బరి నీళ్లు తాగితే మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. అది ఎండాకాలమైనా, శీతాకాలమైనా. కొబ్బరి నీళ్లలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కానీ తాజా అధ్యయనం ప్రకారం కొబ్బరినీళ్లు అత్యధికంగా తాగితే మంచికి బదులు చెడు జరుగుతుంది. అసలేంటి ఆ అధ్యయనం? కలిగే ప్రమాదాలేంటి.. పూర్తిగా తెలుసుకుందామా...

PREV
14
కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగితే మరీ అంత డేంజరా? జాగ్రత్త బాస్!
మెదడు పని చేయదు

ఎండాకాలం వచ్చిందంటే.. అత్యధికులు శరీరం చల్లబడటానికి కొబ్బరినీళ్లను ఆశ్రయిస్తారు. కడుపు నొప్పి వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం మనకు అలవాటే. కానీ ఎక్కువగా ఈ పని చేస్తే ప్రాణాంతకం కూడా. అవును.. మీరు చదివింది నిజమే. ఎక్కువ కొబ్బరి నీళ్లు ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తాయి కూడా. ఎక్కువ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డెన్మార్క్‌కు చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు. అంతేకాదు, మొదట్లో అతని మెదడు పని చేయడం కూడా ఆగిపోయింది.

24
అదీ అసలు విషయం

కొబ్బరి నీళ్లు తాగి డెన్మార్క్‌కు చెందిన వ్యక్తి చనిపోవడానికి గల కారణాలు తెలిస్తే షాక్ అవుతారు. ఆ వ్యక్తి తాగిన కొబ్బరి నీళ్లు పూర్తిగా పాడైపోయాయి. దాని నుంచి దుర్వాసన వస్తోంది. అయినా తాగడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఎక్కువ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆ వ్యక్తికి కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు.

34
మెదడులో రక్త ప్రసరణ ఆగిపోయింది

విషపూరితమైన కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మెదడులో రక్త ప్రసరణ ఆగిపోయింది. ఎంఆర్ఐ రిపోర్టులో ఈ విషయం తేలింది. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అధ్యయనం. అందరి విషయానికొస్తే కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కొబ్బరి నీళ్ల వల్ల అలర్జీలు కూడా వస్తాయి.

44
ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత

ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజ లవణాల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల గుండెపోటు, మెదడు పనిచేయకపోవడం వంటివి జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories