వైట్ ఎగ్స్ vs బ్రౌన్ ఎగ్స్.. రెండింటిలో ఇది తింటేనే మంచిది

Published : Oct 16, 2025, 03:00 PM IST

Brown Eggs vs White Eggs:  వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్  రెండూ ఆరోగ్యకరమైనవే. కానీ చాలా మంది వైట్ ఎగ్స్ ను మాత్రమే ఎక్కువగా తింటుంటారు. కొంతమంది ఈ రెండింటిలో బ్రౌన్ ఎగ్స్ లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని చెప్తుంటారు. మరి దీనిలో నిజమెంత అంటే?

PREV
14
వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్

గుడ్లు పోషకాలకు మంచి వనరులు. ఒక పెద్ద సైజు గుడ్డులో 6-7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలు పెరగడానికి సహాయపడుతుంది. గుడ్డులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, కోలిన్, అమైనో ఆమ్లాలు, అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. 

24
గుడ్డు ప్రయోజనాలు

గుడ్డులోని పచ్చ సొన పోషకాల గని. ఇది మన కళ్లను, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇకపోతే గుడ్డులోని తెల్ల సొన కొవ్వు లేని ప్రోటీన్. ఇది బరువు తగ్గడానికి, శరీరాన్ని ఎనర్జిటిక్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది కేవలం శారీరక ప్రయోజనాలను మాత్రమే కాదు మానసిక ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అయితే గుడ్లు మనకు రెండు కలర్లలో దొరుకుతాయి. ఒక వైట్, రెండు బ్రౌన్ ఎగ్స్. మరి ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి? ఏది తింటే మంచిదో  ఇప్పుడు తెలుసుకుందాం.. 

34
దేనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి?

గుడ్లు తెల్ల రంగులో, బ్రౌన్ కలర్ లో ఉంటాయి. అయితే ఈ గుడ్డు పెంకు రంగు అనేది కోడి జన్యువులపై ఆధారపడి ఉంటుంది. అంతేకానీ ఇది దానిలోని పోషకాలను తెలియజేయదు. వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ రెండింటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, మంచి కొవ్వులు ఒకేలా ఉంటాయి. కాబట్టి మీరు ఈ రెండింటిలో ఏది తిన్నా మంచిదే. 

44
ఏ గుడ్డును తింటే మంచిది?

గుడ్డు పెంకు రంగు కోడి జన్యువు వల్ల వస్తుంది కాబట్టి దానికి పోషకాలతో సంబంధం లేదు. గుడ్డు పోషకాలు కోడి వయస్సు,  కోడి తినే ఆహారం, పెంపకం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అయినా రెండు గుడ్ల మధ్య పోషకాల్లో పెద్దగా తేడా ఏం ఉందడని అధ్యయనాలు చెబుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories