మిగిలిపోయిన అన్నాన్ని తినే అలవాటుందా? అయితే మీరిది తప్పకుండా తెలుసుకోవాల్సిందే

Published : Oct 14, 2025, 12:04 PM IST

Leftover Rice: చాలా మంది అన్నాన్ని వృథా కానీయరు. అందుకే రాత్రి లేదా ఉదయం మిగిలిన అన్నాన్ని తింటుంటారు. ఈ మిగిలిన అన్నాన్ని తినడం వల్ల కొన్ని లాభాలున్నాయి, కొన్ని నష్టాలూ ఉన్నాయి. 

PREV
15
మిగిలిన అన్నం

మనలో చాలా మంది ఫుడ్ ను అస్సలు వేస్ట్ చేయరు. కూర మిగిలినా, చపాతీ మిగిలినా, అన్నం మిగిలినా దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వండుకుని తింటుంటారు. ముఖ్యంగా అన్నాన్ని అస్సలు వృథా చేయరు. ఉదయం మిగిలిన దాన్ని రాత్రిపూట, రాత్రిమిగిలిన దాన్ని ఉదయం పూట తింటుంటారు. కానీ ఈ మిగిలి పోయిన అన్నాన్ని తినడం మంచిదేనా అన్న డౌట్ వస్తుంటుంది. నిపుణుల ప్రకారం.. మిగిలిపోయిన అన్నాన్ని తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి.

25
మిగిలిపోయిన అన్నాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పోషకాలు

మిగిలిన అన్నాన్ని గనుక సరిగ్గా నిల్వ చేస్తే అందులో పోషకాలు అలాగే ఉంటాయి. దీనిలో విటమిన్ బి, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. కాబట్టి మిగిలిన అన్నాన్ని తింటే మన శరీరానికి మంచి శక్తి అందుతుంది.

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది

మిగిలిన అన్నాన్ని పెరుగున్నంగా తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచతుంది. అలాగే కడుపు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

35
శరీరాన్ని చల్లగా ఉంచుతుంది

ఎండాకాలంలో మిగిలిన అన్నాన్ని తినడం చాలా మంచిది. చల్లగా ఉన్న అన్నాన్ని తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. చాలా మంది గ్రామాల్లో శరీర వేడిని తగ్గించుకోవడానికి మిగిలిన అన్నాన్ని తింటుంటారు. ముఖ్యంగా రాత్రంతా పులియబెట్టిన అన్నంలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంటుంది.

రెసిస్టెంట్ స్టార్చ్

మిగిలిన అన్నంలో ఒక ప్రత్యేకరకమైన పిండి పదార్థం ఏర్పడుతుంది. దీనినే రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు. ఈ పిండి పదార్థం మన శరీరంలో జీర్ణం కాదు. కానీ ఇది పేగుల్లో ఫైబర్ మాదిరిగా పనిచేస్తుంది.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

రెసిస్టెంట్ స్టార్చ్ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మిగిలిపోయిన అన్నం టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే వేడి వేడి అన్నం కాకుండా చల్లగా ఉన్న అన్నాన్ని డయాబెటీస్ పేషెంట్లు తినడం మంచిదంటారు.

45
బరువు కంట్రోల్

మిగిలిపోయిన అన్నం మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు ఎక్కువగా తినే అవకాశాలు తగ్గుతాయి. ఇది మీరు బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

55
మిగిలిపోయిన అన్నం తినడం వల్ల వచ్చే సమస్యలు

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు

మిగిలిన అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఒకటి. ముడి బియ్యంలో బాసిల్లస్, సెరియస్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి అన్నం వండినా నాశనం కావు. మీరు అన్నాన్ని వండి గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరిచినప్పుడు ఈ బ్యాక్టీరియా అందులో ఫాస్ట్ గా పెరుగుతంది. ఇది విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి అన్నాన్ని తిరిగి వేడి చేసినా చనిపోవు.

ఫుడ్ పాయిజనింగ్

బ్యాక్టీరియాతో కలుషితమైన అన్నాన్ని తింటే వాంతులు, కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ లక్షణాలు మిగిలిన అన్నం తిన్న 1 నుంచి 5 గంటల్లో కనిపిస్తాయి. మిగిలిన అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకుండా తింటే ఫుడ్ ఫాయిజనింగ్ అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తారు.

పోషకాల నష్టం

మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే అన్నంలో ఉన్న కొన్ని నీటిలో కరిగే విటమిన్లు తగ్గుతాయి. అలాగే చాలా మందికి మిగిలిన అన్నం తినడం వల్ల పొత్తికడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్యలు గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులకే వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories