Kitchen tips: నల్ల మచ్చలున్న ఉల్లిపాయలను తింటే ఏమవుతుందో తెలుసా?

Published : May 19, 2025, 04:18 PM IST

వంటింట్లో ఉపయోగించే పదార్థాల్లో ఉల్లిపాయలు ముందు వరుసలో ఉంటాయి. వీటితో కూర రుచి పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే కొన్నిసార్లు ఉల్లిపాయల మీద నల్లటి మచ్చలు చూస్తుంటాం. అలా ఉన్నప్పుడు వాటిని తినచ్చా? లేదా ఇక్కడ చూద్దాం.  

PREV
16
ఉల్లిపాయ ఉపయోగాలు

వంటకి కావాల్సిన పదార్థాల్లో ఉల్లిపాయ ఒకటి. ఏ వంట చేసినా ఉల్లిపాయ కావాలి. అందుకే కిలోల కొద్దీ ఉల్లిపాయలు కొనుక్కుంటాం. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం నుంచి మెరిసే చర్మం, బరువు తగ్గడం, దృఢమైన ఎముకలు, ఆరోగ్యకరమైన గుండె, మంచి జీర్ణక్రియకు ఉల్లిపాయ సహాయపడుతుంది.

26
నల్లటి మచ్చలుంటే?

మార్కెట్ నుంచి తెచ్చిన ఉల్లిపాయ తొక్క తీసేటప్పుడు ఒక్కోసారి దానిమీద నల్లటి దుమ్ములాంటి మచ్చలు కనిపిస్తాయి. ముట్టుకుంటే చేతులకు అంటుకునే ఈ మచ్చలు మట్టిలా కనిపిస్తాయి. అసలు అది ఏంటి? అలా ఉన్నప్పుడు ఉల్లిపాయలు తినచ్చా? లేదో ఇక్కడ చూద్దాం.

36
శరీరానికి హానికరం

ఈ నల్ల మచ్చలు ఆస్పర్‌గిల్లస్ నైగర్ అనే ఒక రకమైన ఫంగస్ వల్ల వస్తాయి. ఈ ఫంగస్ మట్టిలో ఉంటుంది. దానివల్ల ఉల్లిపాయలో కూడా కనిపిస్తుంది. ఇది బ్లాక్ ఫంగస్ లాంటి ప్రమాదకరమైన వ్యాధిని కలగచేయకపోయినా.. శరీరానికి హానికరం.

46
నల్లమచ్చల ఉల్లిపాయలు తింటే?

కాబట్టి ఈ ఫంగస్ ఉన్న ఉల్లిపాయలు తినకపోవడమే మంచిది. ఈ ఫంగస్ వల్ల అలెర్జీ రావచ్చు. ముఖ్యంగా అలెర్జీ ఉన్నవారు ఈ ఉల్లిపాయలు తినకూడదు. అంతేకాదు ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఉల్లిపాయలు తినకూడదు. దీనివల్ల మీకు హాని జరగవచ్చు.

56
అన్ని ఉల్లిపాయలకు ఉంటే?

ఒకవేళ మీరు కొన్న అన్ని ఉల్లిపాయల్లో నల్ల మచ్చలు ఉంటే దాని పై రెండు పొరలు తీసేయండి. ఈ ఫంగస్ ఎక్కువగా పై పొరల్లోనే ఉంటుంది. రెండు పొరలు తీసి, బాగా కడిగి వాడుకోవచ్చు.

66
బ్లాక్ ఫంగస్ కనిపిస్తే?
ఉల్లిపాయతో పాటు బ్లాక్ ఫంగస్ కూడా కనిపిస్తే, వెంటనే దాన్ని పడేయండి. దాన్ని వాడకండి. దీనివల్ల కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు రావచ్చు. కాబట్టి దీన్ని దూరం పెట్టడమే మంచిది.
Read more Photos on
click me!

Recommended Stories