Lunch Ideas: మధ్యాహ్నం భోజనంలో ఏం తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

Published : May 19, 2025, 03:56 PM IST

ఆరోగ్యంగా ఉండడానికి సమయానుసారం మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది మధ్యాహ్నం భోజనంలో సరైన ఆహారం తీసుకోరు. ఏవేవో తిని ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటారు. మరి లంచ్ లో ఏం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో ఇక్కడ చూద్దాం.

PREV
17
మధ్యాహ్న భోజనంలో ఏం తినాలి?

మధ్యాహ్నం కాస్త ఎక్కువగా తిన్నా పెద్ద ఇబ్బంది ఉండదు. ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి.. ఆరోగ్యంపై అంతగా ప్రభావం పడదు. అయితే మధ్యాహ్న భోజనంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ చూద్దాం. 

27
అన్నం, సాంబార్

వంట చేయడానికి ఎక్కువ టైం లేకపోతే అన్నం, సాంబార్ చేసుకోవచ్చు. సాంబార్ వీలుకాకపోతే రసం కూడా చేసుకోవచ్చు. పప్పు, కూరగాయలతో సాంబార్ చేసుకుంటే బాగుంటుంది. అంతేకాదు అన్నం, సాంబార్ త్వరగా జీర్ణమయ్యే ఆహారం. అందుకే మధ్యాహ్నం భోజనానికి ఇది మంచి కాంబినేషన్.

37
చపాతీ, కూర

ఇష్టమైన కూరతో చపాతీ తినొచ్చు లేదా పూరి, కూర కూడా మధ్యాహ్నం భోజనానికి మంచి కాంబినేషన్. డైట్‌లో ఉన్నవారికి చపాతీ మంచిది. పప్పు, కూరగాయలు, ఆకుకూరలతో చపాతీ బాగుంటుంది.

47
జొన్న రొట్టె, కూర

జొన్న రొట్టె రుచికరంగా ఉంటుంది.  ఆరోగ్యానికి కూడా మంచిది. మధ్యాహ్నం భోజనం కోసం చాలామంది జొన్న రొట్టె తినడానికి ఆసక్తి చూపిస్తారు. శాఖాహారులకు ఇష్టమైన ఆహారాల్లో జొన్న రొట్టె ఒకటి. దీనికి అన్ని కూరలు బాగుంటాయి. చికెన్/మటన్ కూడా చాలా బాగుంటుంది.

57
రాగి ముద్ద, పప్పు

రాగి ముద్ద అంటే చాలామందికి నోరూరుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రాగి ముద్దతో పప్పు, కారం, అవకాయ, సాంబార్, చికెన్/మటన్ కూడా బాగుంటాయి. 3 పూటలు రాగిముద్ద తినేవారు కూడా లేకపోలేదు.

67
వెజిటేబుల్ పులావ్

మధ్యాహ్నం భోజనానికి పులావ్ కూడా మంచిది. రకరకాల కూరగాయలు, ధాన్యాలతో చేసిన పులావ్ తింటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. చిత్రాన్నం, టమాటో బాత్, పులిహోర, బిసిబేళెబాత్ లాంటివి కూడా తినొచ్చు.

77
నాన్ వెజ్..

మీరు మాంసాహార ప్రియులైతే మధ్యాహ్నం టైంలో నాన్ వెజ్ తినొచ్చు. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మధ్యాహ్నం తింటే రాత్రి వరకు జీర్ణం కావడానికి టైం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన మాంసాహారం తినచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories