పుదీనా చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. దీని ఘాటైన వాసన, టేస్ట్ దోశ, ఇడ్లీలోకి బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీలను పుదీనా చట్నీతో తింటే ఆ టేస్ట్ ను మీరెప్పుడూ మర్చిపోలేరు. కాబట్టి ఈ సారి ఇడ్లీ చేసినప్పుడు పుదీనా చట్నీని ఖచ్చితంగా చేయండి.
వేరుశెనగ చట్నీ
వేరుశెనగ చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది. సాధారణంగా దీన్ని చాలా మంది ఇడ్లీ, దోశలోకి చేస్తుంటారు. నిజానికి ఈ చట్నీ టేస్టీగా ఉండటమే కాకుండా ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. క్రీమీగా, టేస్టీగా ఉండే ఈ వేరుశెనగ చట్నీ ఇడ్లీ, దోశ, వడలోకి బాగుంటుంది.