మొలకలు మంచివే అయినా.. వీటిని పచ్చిగా తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఈకోలీ, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని పచ్చిగా తింటే వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మొలకలు అంత సులువుగా జీర్ణం కావు. అలాగే మన శరీరం వీటిలోని అనని పోషకాలను పొందదు.