వాహ్.. దాల్చిన చెక్క టీ: రుచికి రుచి, రోగాలన్నీ పరార్!

దాల్చిన చెక్క ఒక సుగంధ ద్రవ్యమే కాదు.. ఆరోగ్యప్రదాయిని కూడా. దాల్చిన చెక్కలో పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీన్ని సరిగా ఉపయోగిస్తే బోలెడన్ని ఉపయోగాలు ఉంటాయి. మరి అలాంటి దాల్చిన చెక్కను ఉపయోగించి రుచికరమైన, ఆరోగ్యకరమైన టీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

Benefits of cinnamon tea in telugu
కావాల్సిన పదార్థాలివే:

1-2 దాల్చిన చెక్కలు లేదా 1/2 - 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి
1 కప్పు నీరు
తేనె లేదా బెల్లం (రుచికి తగినంత)
నిమ్మరసం 

తయారు చేయండిలా:

ఒక పాత్రలో నీరు పోసి మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు, దాల్చిన చెక్క పుల్లలు లేదా దాల్చిన చెక్క పొడి వేయండి. తర్వాత మంటను తగ్గించి 5-10 నిమిషాలు ఉడకనివ్వండి. ఎక్కువసేపు ఉంచితే టీ ఆవిరి అవుతుంది. ఆపై దాల్చిన చెక్కలు పోయేలా టీని వడకట్టండి. మంచి రుచి వచ్చేలా తేనె లేదా బెల్లం కలపండి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇంకేం.. దాల్చిన చెక్క టీ రెడీ. దీన్ని వేడిగానే తాగుతూ వేడిగా ఆస్వాదించండి. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. 

ఈ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

మెదడు పనితీరుపై ప్రభావం: దాల్చిన చెక్క మెరుగైన జ్ఞాపకశక్తి, లోతుగా ఆలోచించడానికి  సహాయ పడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేకరకాల ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి. దాంతో సహజంగానే మనలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. 

గుండెకు మేలు: దాల్చిన చెక్క రక్తపోటును తగ్గించడంలో, ట్రైగ్లిజరైడ్లు (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది HDL (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.


cinnamon water

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది.  దాల్చిన చెక్క సైతం అదే పని చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

మెరుగైన జీర్ణక్రియ: దాల్చిన చెక్క జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది  అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. తిన్నది తేలికగా జీర్ణమవుతుంది.

బరువు తగ్గించడంలో కీలకం: దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేయడంలో  కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది కూడా.

ఋతుక్రమ సమస్యలకు చెక్: దాల్చిన చెక్క హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Latest Videos

vuukle one pixel image
click me!