స్వీట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఆ పేరు వింటేనే నోరూరిపోతూ ఉంటుంది. కొన్ని స్వీట్లు ఇంట్లో తయారు చేసుకొని తింటాం. మరికొన్ని బయట కొనుగోలు చేస్తుంటాం. సాధ్యమైనంత వరకు మన దగ్గర దొరికే ఫేమస్ స్వీట్లను టేస్ట్ చేస్తూనే ఉంటాం. వీలైతే ఎక్కడ ఏ స్వీట్ ఫేమసో తెలుసుకొని అక్కడి నుంచి అది తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇలా ఇన్ని రకాల స్వీట్లను టేస్ట్ చేశాక... దేశంలోనే టాప్ 10 ఫేమస్ స్వీట్లను తినకపోతే ఎలా? ఓసారి ట్రై చేయండి.
భారత దేశంలో చాలా ఫేమస్ స్వీట్స్ ఉన్నాయి. అయితే వాటిలో గులాబ్ జామున్ ముందు వరుసలో ఉంటుంది. ఏ ఫంక్షన్ లోనైనా ఈ స్వీట్ తప్పనిసరిగా ఉంటుంది. గులాబ్ జామున్ ఖోయా నుంచి తయారైన ఒక క్లాసిక్ భారతీయ స్వీట్. దీన్ని బాల్స్ ఆకారంలో తయారు చేస్తారు. డీప్ ఫ్రై చేసిన తర్వాత చక్కెర పాకంలో నానబెడతారు. ఈ స్వీట్ ను అందరు ఇష్టంగా తింటారు.
210
రసగుల్లా
రసగుల్లా.. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ఫేమస్ స్వీట్. ఇది ఛేనా (పాలు నుంచి తయారైన పనీర్) చక్కెర పాకంతో తయారు చేస్తారు. దీని రుచి చాలా తియ్యగా ఉంటుంది. మెత్తగా, రౌండ్ గా ఉంటుంది.
310
జిలేబి
జిలేబి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. ముందుగా దీని పిండిని తయారు చేస్తారు. ఆ తర్వాత కుంకుమపువ్వు పాకంలో నానబెట్టి తింటారు. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండటం దీని ప్రత్యేకత.
410
కాజు కట్లీ
కాజు.. జీడిపప్పు, చక్కెర, నెయ్యితో చేసిన స్వీట్. సాధారణంగా పండుగల సమయంలో బహుమతిగా ఇచ్చే స్వీట్లలో ఇది ముందు వరుసలో ఉంటుంది. రుచి సూపర్ గా ఉంటుంది.
510
లడ్డు
ఈ స్వీట్‌ను శనగపిండి, రవ్వతో పాటు అనేక పదార్థాలతో తయారు చేస్తారు. దేశ వ్యాప్తంగా అందరూ దీన్ని ఇష్టపడతారు. ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు.
610
మైసూర్ పాక్
మైసూర్ పాక్ కర్ణాటక ప్రసిద్ధ స్వీట్. ఈ మైసూర్ పాక్‌ను నెయ్యి, చక్కెర, శనగపిండితో తయారు చేస్తారు. ఇది తన రుచితో అందరినీ ఆకట్టుకుంటుంది.
710
బర్ఫీ
బర్ఫీ అనేది కొబ్బరి, పిస్తా, చాక్లెట్ వంటి పదార్థాలతో తయారయ్యే స్వీట్. ఇది ఎక్కువగా చతురస్రాకారంలో లభిస్తుంది.
810
మాల్పువా
పిండి, కొబ్బరితో చేసిన ఒక సాంప్రదాయ పాన్‌కేక్ లాంటి స్వీట్ మాల్పువా. దీన్ని డీప్ ఫ్రై చేసి చక్కెర పాకంలో ముంచుతారు. దీన్నిఎక్కువశాతం పండుగల సమయంలో తయారు చేస్తారు.
910
గజర్ కా హల్వా
గజర్ కా హల్వా లేదా క్యారెట్ హల్వాను శీతాకాలంలో ఎక్కువగా తయారు చేస్తారు. తురిమిన క్యారెట్‌ను పాలు, చక్కెరతో కలిపి ఉడికిస్తారు. ఇది అందరికీ ఇష్టమైన స్వీట్.
1010
పంజీరి
గోధుమ పిండి, నెయ్యి, చక్కెర, డ్రై ఫ్రూట్స్‌తో చేసిన ఒక పౌష్టికాహార స్వీట్ పంజీరి. దీన్ని చాలామంది ఇళ్లలో ప్రసాదంగా తయారుచేసి తింటారు.