మన శరీరానికి కావాల్సిన పోషకాల్లో మెగ్నీషియం ఒకటి. మెగ్నీషియం లోపం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో ప్రధానమైంది నిద్రలేమి. మరి నిద్ర సమస్యలకు చెక్ పెట్టాలంటే.. మెగ్నిషియం ఉన్న ఈ ఆహారాలు తీసుకుంటే చాలు.
మెగ్నీషియం.. శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం. ఇది 300 కంటే ఎక్కువ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మంచి నిద్ర కోసం మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
మెగ్నీషియం.. మెదడులోని గామా అమైనోబ్యూట్రిక్ యాసిడ్ గ్రాహకాలను సక్రియం చేస్తుంది. ఇది ఒక న్యూరోట్రాన్స్మిటర్. ఇది మెదడు కార్యకలాపాలను తగ్గించి, నాడీ వ్యవస్థను శాంతపరచి నిద్రకు సిద్ధం చేస్తుంది.
25
నిద్రలేమి సమస్యలకు చెక్..
మెగ్నీషియం.. ఒత్తిడి హార్మోన్లు అయినా కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. దీనివల్ల నిద్ర సులభంగా వస్తుంది. మెగ్నీషియం కండరాల సంకోచాలు, కండరాల సడలింపులో కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల రాత్రిపూట కండరాల నొప్పులు లేదా రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.
అంతేకాకుండా నిద్ర చక్రాన్ని నియంత్రించే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల సులభంగా నిద్ర వస్తుంది.
35
మెగ్నీషియం ఉండే ఆహారాలు..
ఆకుకూరలు, బ్రోకలి, క్యాబేజీ వంటి ఆకుపచ్చ కూరగాయలు.. బాదం, జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు, చియా గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు మొదలైన వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. పప్పులు, బీన్స్ వంటి చిక్కుళ్లు కూడా మెగ్నీషియాన్ని కలిగి ఉంటాయి.
ఇవి కాకుండా బ్రౌన్ రైస్, తృణధాన్యాలు, ఓట్స్ కూడా మెగ్నీషియానికి మంచి వనరులు. కొన్నిరకాల డార్క్ చాక్లెట్‌లో కూడా మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
మెగ్నీషియం శరీరానికి మాత్రమే కాదు.. మెదడు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మెదడు సంబంధిత రుగ్మతలను తగ్గించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది.
2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. తగినంత మెగ్నీషియం తీసుకున్న వారిలో నిద్ర నాణ్యత మెరుగుపడినట్లు తేలింది.
55
ఇది గుర్తుంచుకోండి..
మెగ్నీషియం ఎక్కువగా ఆహారం ద్వారానే శరీరానికి అందుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేని వారికి వైద్యులు సప్లిమెంట్‌లను సూచిస్తుంటారు. నిపుణులను సంప్రదించకుండా ఎక్కువ మొత్తంలో మెగ్నీషియం తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు.
మెగ్నీషియం లోపం నిద్ర సమస్యలకు ఒక కారణం కావచ్చు. కానీ నిద్రలేమికి చాలా కారణాలు ఉంటాయి. నిద్ర సమస్యలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.