Summer: ఎండాకాలంలో తొందరగా పాడయ్యేవి ఇవే

Published : May 21, 2025, 03:56 PM IST

 వేసవిలో కొన్ని ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి. పాలు, పెరుగు, వండిన అన్నం, ముక్కలు చేసిన పండ్లు, సలాడ్, బేకరీ వస్తువులు, ఉల్లిపాయలు-వెల్లుల్లి వేసినవి 24 గంటల్లో తినేయాలి.

PREV
16
పాలు, పాల పదార్థాలు

వేసవిలో పాలు, పాల ఉత్పత్తులు, పన్నీర్, పెరుగు, కస్టర్డ్ త్వరగా పాడైపోతాయి. కాబట్టి 6 నుండి 8 గంటల్లో తినేయాలి. అంతకు మించి ఎక్కువసేపు బయట ఉంచితే పాడైపోతాయి. కావాలంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు.

26
వండిన అన్నం

వండిన అన్నంలో బాక్టీరియా త్వరగా పెరుగుతాయి,  తొందరగా పాడైపోతుంది కూడా. వేసవిలో ఒకటి రెండు రోజుల నాటి అన్నం తినకండి. చద్దన్నం తినాలి అనుకుంటే.. రాత్రిపూట అందులో పెరుగు కలుపుకొని ఉదయాన్నే తినడం మంచిది.

36
అరటి, ముక్కలు చేసిన పండ్లు

అరటిపండు, ముక్కలు చేసిన ఆపిల్, బొప్పాయి, మామిడి త్వరగా నల్లబడి, కుళ్ళిపోతాయి. వేసవిలో వీటిని త్వరగా తినేయాలి. కోసిన వెంటనే తాజాగా ఉన్నప్పుడే తినాలి.

46
సలాడ్

వేసవిలో ముందుగానే సలాడ్ కట్ చేసి పెట్టుకోకండి. గాలికి త్వరగా పాడైపోతుంది. టమాట, దోసకాయ, ఉల్లి, నిమ్మ వంటివి వెంటనే కట్ చేసి, వెంటనే తినేయాలి. 

56
బేకరీ వస్తువులు
కేక్, బ్రెడ్, పేస్ట్రీ, పిజ్జా వంటి బేకరీ వస్తువుల్లో తేమ త్వరగా చేరి ఫంగస్ పడుతుంది. 24 గంటలకు మించి ఫ్రిజ్‌లో పెట్టకండి. త్వరగా తినేయండి.
66
ఉల్లి, వెల్లుల్లి వేసినవి

పప్పు, కూరల్లో ఉల్లి, వెల్లుల్లి వాడితే 24 గంటలకు మించి వాడకండి. వేసవిలో ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు త్వరగా పాడైపోతాయి. అవి వేసి వండిన వంటలు కూడా పాడై వాసన వస్తాయి. అందుకే, వంట చేసిన వెంటనే తినేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories