Top 5 Tea Drinking Countries: టీ ఎక్కువగా తాగే టాప్ 5 దేశాలెంటో తెలుసా?

Published : May 21, 2025, 03:25 PM IST

మనలో చాలామందికి టీ ఒక ఎమోషన్. ఉదయాన్నే టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీలయ్యే వాళ్లు చాలామంది ఉంటారు. రోజుకు 3, 4 సార్లు టీ తాగేవాళ్లు కూడా లేకపోలేదు. మరి ప్రపంచవ్యాప్తంగా టీ ఎక్కువగా తాగే టాప్ 5 దేశాలెంటో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.  

PREV
15
టర్కీ

టర్కీ.. ప్రపంచంలోనే అత్యధికంగా టీ తాగే దేశం. టర్కీ లోని ప్రతి వ్యక్తి సంవత్సరానికి సగటున 1,300 కప్పుల టీ తాగుతాడట. అంటే రోజుకు 3 నుంచి 5 కప్పులు. చలికాలంలో 10 కప్పుల వరకు తాగుతారట. వారు స్ట్రాంగ్ బ్లాక్ టీ తాగడానికి ఇష్టపడతారట. టర్కిష్ సంస్కృతిలో టీకి ప్రత్యేక స్థానం ఉంది.

25
ఐర్లాండ్

టీ వినియోగంలో ఐర్లాండ్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. పాలతో కలిపి చేసిన స్ట్రాంగ్ బ్లాక్ టీ ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడి వారు సంవత్సరానికి సుమారు 2.19 బిలియన్ కిలోల టీని తాగుతారట. ఈ దేశంలో టీ తాగడం ఒక సామాజిక సంప్రదాయం.

35
యునైటెడ్ కింగ్‌డమ్

UK లో సంవత్సరానికి సుమారు 1.94 బిలియన్ కిలోల టీ వినియోగం జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ టీని చాలామంది ఇష్టపడతారు. హెర్బల్  ఫ్లేవర్డ్ టీలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. 18, 19వ శతాబ్దాల్లో బ్రిటిష్ సంస్కృతిలో టీ ఒక భాగమైంది.

45
పాకిస్తాన్

పాకిస్తాన్‌లో కూడా టీ ని ఇష్టంగా తాగుతారు. ఈ దేశంలో టీ వినియోగం సంవత్సరానికి 1.50 బిలియన్ కిలోలు. ఇంట్లో ట్రెడిషనల్ ఛాయ్ అయినా, రోడ్డు పక్క ఛాయ్ అయినా.. పాకిస్తానీ సంస్కృతిలో టీకి ప్రత్యేక స్థానం ఉంది.

55
రష్యా

రష్యాలో శతాబ్దాల నాటి నుంచి టీ తాగే సంప్రదాయం ఉంది. ఈ దేశంలో సంవత్సరానికి దాదాపు 1.38 బిలియన్ కిలోల టీని వినియోగిస్తారు. సుమారు 80 శాతం జనాభా టీని తాగుతారు. సామాజిక, కుటుంబ సమావేశాల్లో టీ ముఖ్యమైన భాగం. ఇక్కడ కూడా ఎక్కువగా బ్లాక్ టీనే తాగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories