Hemoglobin foods: హిమోగ్లోబిన్‌ను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే.. ప్రతిరోజు కనీసం ఒక్కటైనా..

Published : May 20, 2025, 07:53 AM IST

Hemoglobin : రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్య తగ్గాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం మంచిది. అవేంటో ఓ లూక్కేయండి.  

PREV
17
ఐరన్ రిచ్ ఫుడ్స్

హిమోగ్లోబిన్ లోపం వల్ల రక్తహీనత (అనీమియా) సమస్య తలెత్తుంది.  రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిపోతే శరీరంలో ఆక్సిజన్ సరఫరా  తగ్గుతుంది. దీని వల్ల అవయవాలు సరిగా పనిచేయవు. ఐరన్, బి విటమిన్లు, విటమిన్ సి వంటి పోషకాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరం. పాలకూర నుండి బీట్ రూట్ వరకు మీ హిమోగ్లోబిన్ స్థాయిలను సహజంగా పెంచగల ఆహారాలు ఇవిగో..  

27
బీట్ రూట్

బీట్ రూట్ లో ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఎర్ర రక్త కణాల పునరుత్పత్తికి సహాయపడుతాయి. రక్త ప్రసరణ మెరుగుపరచడానికి దీన్ని జ్యూస్‌గా, సలాడ్లలో లేదా వండుకొని తినండి.

37
టోఫు

సోయాబీన్స్ నుండి తయారైన టోఫులోనూ ఐరన్,  ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. శాఖాహారులకు ఇది చాలా ఉపయోగకరం. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి వేపుళ్ళు, కూరలు లేదా గ్రిల్ చేసిన వంటలలో దీన్ని చేర్చవచ్చు.

47
గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలు చూడానికి చిన్నవి గానే ఉన్నా.. శక్తివంతమైనవి.  ఐరన్, జింక్, మెగ్నీషియం కలిగి ఉంటాయి. ఇవి సలాడ్లు, తృణధాన్యాలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుదలతో పాటు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. 

57
పప్పులు

పప్పుధాన్యాలు మొక్కల ఆధారిత ఐరన్ తో పాటు ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్‌లను అందిస్తాయి. ఈ పోషకాలు ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడతాయి. వీటిని నానబెట్టి, సరిగ్గా ఉడికించడం వల్ల ఐరన్ శోషణ మెరుగుపడుతుంది.

67
రెడ్ మీట్

రెడ్ మీట్..  ఐరన్ కు మెయిన్ సోర్స్.  క్రమం తప్పకుండా, మితంగా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు గణనీయంగా మెరుగుపడతాయి. సమతుల్య,  ఐరన్ అధికంగా ఉండే భోజనానికి ఆకుకూరలు లేదా తృణధాన్యాలతో కలిపి తీసుకోండి.

77
పాలకూర

పాలకూర అనేది నాన్-హీమ్  ఐరన్, విటమిన్ సి అధికంగా ఉండే ఆకుకూర. దీనిని ఉడికించి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పోషకాలతో కూడిన హిమోగ్లోబిన్ బూస్టర్ కోసం సూప్‌లు, కూరలు లేదా స్మూతీలలో చేర్చండి.

Read more Photos on
click me!

Recommended Stories