బాలీవుడ్ టు టాలీవుడ్.. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతిసారి రకుల్ పేరు.. నిజంగా ఆమె డ్రగ్ అడిక్టా?

First Published Aug 26, 2021, 11:50 AM IST


గత ఏడాది బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపింది. డ్రగ్స్ ఆరోపణలపై సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి తో పాటు ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. 
 

అనంతరం బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింగ్,సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్ లు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2020 సెప్టెంబర్ నెలలో దీపికా, రకుల్, సారా, శ్రద్దా వరుసగా నార్కోటిక్ బ్యూరో కంట్రోల్ అధికారుల విచారణలో పాల్గొన్నారు. 
 

ఈడీ 10మంది టాలీవుడ్ ప్రముఖులతో పాటు మొత్తం 12మందికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. 2017లో  డ్రగ్స్ వినియోగం లేదా అమ్మకాలు, కొనుగోళ్ళకు పాల్పడుతున్నారనే అభియోగాలపై పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందు, సుబ్బరాజు, నవదీప్ లకు నోటీసులు జారీచేశారు. విచారణ అనంతరం వీరి నుండి సాంపిల్స్ సేకరించి శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్ల కోసం టెస్ట్స్ కి పంపించారు. 

మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్‌... 11 కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో ఎక్కడా సినీ రంగానికి చెందిన వారిని నిందితులుగా చేర్చలేదు. తాజాగా హీరో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు జోడించి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. 
 

ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 22వరకు పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ వరుసగా విచారణ ఎదుర్కోనున్నారు. 


అయితే డ్రగ్స్ ఆరోపణలు తెరపైకి వచ్చిన ప్రతిసారి రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. బాలీవుడ్ లో కూడా డ్రగ్స్ ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న రకుల్ మరో మారు విచారణలో పాల్గొనాల్సి వచ్చింది. సెప్టెంబర్ 6న రకుల్ అధికారుల ముందుకు హాజరు కావాల్సి ఉంది. 
 


నిప్పు లేకుండా పొగ రాదంటారు. అసలు డ్రగ్స్ మాఫియా లేదా వినియోగంతో ఎటువంటి సంబంధం లేకుండా రకుల్ పేరు ప్రతిసారి ఎందుకు అధికారుల లిస్ట్ లో ఉంటుంది అనేది ఆలోచించాలి. ఈ నేపథ్యంలో నిజంగా రకుల్ డ్రగ్ అడిక్టా, ఆమెకు డ్రగ్ మాఫియా తో సంబంధాలు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. 

click me!