మహేష్ బాబు సూపర్ హిట్ మూవీలో వేణు స్వామి చేసిన పాత్ర ఏంటంటే? వైరల్ గా వీడియోలు

Published : Jan 03, 2024, 01:17 PM IST

వివాదాస్పద స్వామిజీ వేణు స్వామి నటుడు కూడాను. ఆయన మహేష్ బాబు, జగపతిబాబు చిత్రాల్లో నటించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
16
మహేష్ బాబు సూపర్ హిట్ మూవీలో వేణు స్వామి చేసిన పాత్ర ఏంటంటే? వైరల్ గా వీడియోలు
Venu Swami

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పాప్యులర్ అయ్యాడు వేణు స్వామి. హీరోలు-హీరోయిన్స్ ప్రేమలు, పెళ్లిళ్లు, వాటి ఫలితాలు జాతకం ప్రకారం అంచనా వేసి చెబుతూ ఉంటాడు. వేణు స్వామి కామెంట్స్ హీరోల ఫ్యాన్స్ ని హర్ట్ చేసేలా ఉంటాయి. 

 

26

నాగ చైతన్య, సమంత, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి టాప్ సెలెబ్స్ వ్యక్తిగత విషయాలు, కెరీర్ గురించి వేణు స్వామి అంచనాలు ఇబ్బందిపెట్టేవిగా ఉండేవి. అయితే వేణు స్వామిని పలువురు సెలెబ్రిటీలు నమ్ముతారు. జీవితంలో ఎదగాలని ఆయన చేత పూజలు చేయించుకుంటారు. 

36
Venu Swami


రష్మిక మందాన పలుమార్లు వేణు స్వామి చేత పూజలు చేయించుకుంది. నిధి అగర్వాల్, డింపుల్ హయాతి సైతం వేణు స్వామి పూజల్లో పాల్గొన్నారు. ఇందుకు ఆయన లక్షల్లో వసూలు చేస్తాడని సమాచారం. టాలీవుడ్ సెలెబ్స్ చాలా మంది ఆయనకు క్లయింట్స్. 

 

46

కాగా వేణు స్వామికి చాలా కాలంగా టాలీవుడ్ తో అనుబంధం ఉంది. సినిమా ఓపెనింగ్స్, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలకు వేణు స్వామినే పిలిచేవారు. ఈ క్రమంలో ఆయన కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. 
 

56
Venu Swami

జగపతి బాబు హీరోగా 2005లో జగపతి టైటిల్ తో ఒక మూవీ విడుదలైంది. ఈ చిత్రంలో గుడిలో అర్చకుడు పాత్ర చేశాడు వేణు స్వామి. ఆయనకు డైలాగ్స్ కూడా ఉన్నాయి. 

 

66

అలాగే అతడు మూవీలో 'పిలిచినా రానంటావా' సాంగ్ లో పెళ్లిలో బ్రాహ్మణుడు గా కనిపించాడు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు మూవీ మంచి విజయం సాధించింది. అప్పట్లో వేణు స్వామి అంటే ఎవరికీ తెలియదు. పాప్యులర్ అయ్యాక, ఇకప్పటి ఆయన వీడియోలు బయటకు వస్తున్నాయి.  

Read more Photos on
click me!

Recommended Stories