5కాదు 10కోట్లు.. అంతా తప్పుడు ప్రచారమే... ఫ్యామిలీ మాన్ 2కి సమంత రెమ్యునరేషన్ ఎంతంటే?

First Published Jun 17, 2021, 7:50 AM IST

ఆరంభంతోనే తానేంటో నిరూపించింది సమంత. డిజిటల్ ఎంట్రీతో దుమ్ము రేపింది. ఫార్మాట్ ఏదైనా తాను కాలుపెడితే కనక వర్షమే అని రుజువు చేసింది. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఫ్యామిలీ మాన్ 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

కెరీర్ లో సమంత నెగిటివ్ షేడ్స్ కలిగిన డీగ్లామర్ రోల్ చేశారు. లేడీ ఉగ్రవాదిగా ఆమె డిజిటల్ స్క్రీన్ పై అద్భుతం చేశారు. ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో సమంత నటనకు బాలీవుడ్ సైతం ఫిదా కావడం జరిగింది. ఎటువంటి ఎమోషన్స్ లేని అమ్మాయిగా సమంత చాలా సహజంగా చేశారు.
undefined
ది ఫ్యామిలీ మాన్ 2 సూపర్ సక్సెస్ నేపథ్యంలో ప్రధాన పాత్రలు చేసిన మనోజ్ బాజ్ పాయ్, సమంత రెమ్యూనరేషన్స్ పై కొద్దిరోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం మనోజ్, సమంతలకు భారీ మొత్తంలో చెల్లించారు అనేది ఆ వార్తల సారాంశం.
undefined
ఫ్యామిలీ మాన్ మొదటి సిరీస్ తో పాటు ప్రస్తుత సిరీస్ లో నటించిన మనోజ్ కి రూ. 10కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని, ఇక సమంతకు అందులో సగం అంటే.. రూ. 5కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. ఐతే ఈ పుకార్లలో ఎటువంటి నిజం లేదని, వీరికి ప్రైమ్ చెల్లించిన రెమ్యూనరేషన్స్ ఇవేనంటూ ఓ ప్రముఖ మ్యాగజైన్ కథనం విడుదల చేసింది.
undefined
ఆ మ్యాగజైన్ కథనం ప్రకారం మనోజ్ బాజ్ కి ప్రచారం జరుగుతున్న దాంట్లో నాలుగో వంతు అంటే రూ. 2.5 కోట్లు ఇచ్చారట. ఇక సమంతకు రూ. 1.5 కోట్లు ఇచ్చారట. మరి ఇదే నిజమైతే చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి సమంత ఈ ప్రాజెక్ట్ చేసినట్లు అవుతుంది.
undefined
మరోవైపు ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ పై వివాదం కొనసాగుతూనే ఉంది. తమిళులు తమ మనోభావాలు దెబ్బతీసేదిగా ఈ సిరీస్ ఉందంటూ ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
undefined
ట్రైలర్ విడుదల నాటి నుండే ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ వివాదాలలో చిక్కుకుంది. తమిళులు సమంత పాత్రను పూర్తిగా వ్యతిరేకించారు. ఇక తమిళ సీనియర్ నటులతో పాటు, ప్రభుత్వ పెద్దలు ఈ సిరీస్ ప్రసారం ఆపివేయాలని ప్రైమ్ ని హెచ్చరించారు.
undefined
కాగా ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ నందు హీరోయిన్ ప్రియమణి కూడా కీలక రోల్ చేశారు. వివాదాల సంగతి ఎలా ఉన్నా ప్రైమ్ లో ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది.
undefined
click me!