విజయకాంత్ కమెడియన్ వడివేలును చంపాలి అనుకున్నారా..? ఇద్దరి మధ్య వివాదం ఏంటి? 

First Published Dec 28, 2023, 10:32 AM IST

విజయకాంత్-వడివేలు వివాదం కోలీవుడ్ ని ఊపేసింది. స్టార్ కమెడియన్ వడివేలు తమిళనాడు 2011 సార్వత్రిక ఎన్నికల్లో విజయకాంత్ పై దారుణ ఆరోపణలు చేశారు. ఆ వివాదం ఏమిటో చూద్దాం... 
 


కోలీవుడ్ లో వడివేలు తిరుగులేని కమెడియన్. దశాబ్దాల పాటు సిల్వర్ స్క్రీన్ పై ఆయన హవా సాగింది. అయితే ఆయన జీవితంలో అదే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. నటుడు విజయకాంత్ తో సుదీర్ఘంగా కాంట్రవర్సీ నడిచింది. విజయకాంత్ నన్ను చంపే ప్రయత్నం చేశారని వడివేలు కేసు ఫైల్ చేశాడు. 

విజయకాంత్ హీరోగా నటించిన పలు సినిమాల్లో వడివేలు కమెడియన్ గా చేశారు. వీరు మంచి మిత్రులని సమాచారం. మరి ఇద్దరికీ ఎక్కడ చెడింది?.  వీరి గొడవకు బీజం ఓ సినిమా షూటింగ్ కారణంగా మొదలైందనే వాదన ఉంది. సెట్స్ కి హాజరుకాకపోవడంతో నడిఘర్ సంఘం పెద్దగా విజయకాంత్ షూటింగ్ కి హాజరవ్వాలని వడివేలుకి ఆదేశాలు ఇచ్చాడట. ఆ మూవీ సెట్స్ లో కొన్ని గొడవలు జరిగాయి. 
 

Latest Videos


Vadivelu

అప్పటి నుండి విజయకాంత్ కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వడివేలుకు పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వడివేలు ఇంటిపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలు పగలగొట్టారు. ఈ దాడి వెనుక ఉంది విజయకాంత్ అని వడివేలు కేసు పెట్టాడు. 
 

అనంతరం మరో వివాదంలో విజయకాంత్ పై హత్యాప్రయత్నం కేసు పెట్టాడు. వడివేలు ఆరోపణల్లో నిజం లేదు. అతని ఇంటిపై జరిగిన దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదని విజయకాంత్ వివరణ ఇచ్చారు. 

2011 తమిళనాడు ఎన్నికల్లో డీఏంకే పార్టీ తరపున వడివేలు ప్రచారం చేశారు. డీఎండీకే అధినేతగా ఉన్న విజయకాంత్ పై ప్రచార సభల్లో దారుణ ఆరోపణలు చేశాడు. చిత్ర వర్గాలు కూడా విస్మయ పడే స్థాయిలో వడివేలు కామెంట్స్ ఉన్నాయి. డీఎండీకే పార్టీ గెలవకుండా తుడిచిపెట్టడమే తన లక్ష్యం అని వ్యాఖ్యలు చేశాడు. 

అయితే డీఎండీకే పార్టీ ఆ ఎన్నికల్లో సీట్లు పెంచుకుంది. గత ఎన్నికల్లో కేవలం 1 సీటు రాగా, ఈసారి 29 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా దక్కింది. వడివేలు వ్యాఖ్యలతో అతడు బ్యాన్ కి గురయ్యాడు. ఆయన కెరీర్ నెమ్మదించింది. అనంతరం వడివేలు, విజయకాంత్ ని కలిసి సారీ చెప్పినట్లు సమాచారం... 
 

click me!