ఈరోజు ఎపిసోడ్ లో వేద ,రాణి ఒకచోట కూర్చుని ఉండగా అప్పుడు వేద రాణి తో ఏదో విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉండగా నాతో ఏమైనా మాట్లాడాలా అనగా లేదు అని అంటుంది. సరే అర్థమయింది అబ్బాయి గురించే కదా అనడంతో వేద ఆశ్చర్య పోతుంది. అప్పుడు వేద మనసులో ఉన్న మాటలు అన్నీ కరెక్టుగా రాణి చెప్పడంతో వేద ఆశ్చర్యపోయే అలాగే చూస్తూ ఉంటుంది. చాలామంది భయము, బిడియం ఇవన్నీ ఎక్కువగా ఆడవారికే ఉంటాయని అనుకుంటారు కానీ మన కంటే మగ వాళ్లకు కూడా ఎక్కువగానే ఉంటాయి అంటుంది రాణి. కానీ మగవాళ్ళు బయటపడరు మనం ఆడవాళ్లం తొందరగా బయటపడిపోతాము అని అంటుంది.