తగ్గని రౌడీ క్రేజ్.. ‘అబుదాబీ’ నుంచి ఆహ్వానం.. ట్రెండ్ సెట్ చేస్తున్న విజయ్ దేవరకొండ!

First Published Oct 23, 2022, 6:06 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఒకవైపు వరుస ఫ్లాప్స్ అందుకుంటున్నా ఆయన క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా విజయ్ కి ‘అబుదాబీ’ నుంచి ఆహ్వానం అందింది. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లోనూ అదరగొడుతున్నాడు.
 


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు నాలుగేండ్ల నుంచి ఒక్క హిట్ కూడా పడటం లేదు. కేరీర్ సతమతంగా సాగుతున్నా.. యూత్ లో మాత్రం విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ‘అర్జున్ రెడ్డి’తో రౌడీ క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇప్పటికీ కొనసాగుతోంది. 
 

చివరిగా ‘లైగర్’(Liger) మూవీతో విజయ్ భారీ అపజయాన్ని మూటగట్టుకున్నారు. ఈచిత్రం రిలీజ్ కు ముందుకు ప్రమోషన్స్ లో విజయ్ ఇచ్చిన హైప్, సినిమాకు ఏమాత్రం మ్యాచ్ కాకపోవడంతో ఆడియెన్స్ తోపాటు ఫ్యాన్స్ కూడా అప్సెట్ అయ్యారు. మరోవైపు సినిమాపై తీవ్రంగా ట్రోల్స్ రావడంతో విజయ్ కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. 
 

కానీ, విజయ్ దేవరకొండ సంపాదించుకున్న క్రేజ్ మాత్రం సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రముఖ సంస్థ Thumps Upకు దక్షిణాదిలో విజయ్ దేవరకొండనే ఎంపిక చేసుకున్నారు. ఈ యాడ్ తోనూ రౌడీ క్రేజ్ మరింతగా పెరిగింది. 

‘లైగర్’ రిలీజ్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ ఇటీవల మరో కమర్షియల్ యాడ్ లోనూ నటించారు. ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ వాచ్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇదీగాక రౌడీ హీరో విజయ్ క్రేజ్ కు మరో గౌరవం దక్కింది.
 

పూరీ దర్శకత్వం వహించిన ‘లైగర్’లో ఎంఎంఏ ( మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్) ఫైటర్ గా విజయ్ అలరించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా అబుదాబీలో నిర్వహిస్తున్న యూఎఫ్ సీ - ఎంఎంఏ ఛాంపియన్ షిప్ కు అతిథిగా ఆహ్వానం అందుకున్నారు. ఈ మ్యాచ్ కు విజయ్ తో పాటు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh) కూడా హాజరయ్యారు. 
 

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ క్రేజ్ ఇలా పెరుగుతూనే ఉంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తదుపరి చిత్రాలతో మంచి విజయాన్ని సాధిస్తాడని ఆశిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ‘ఖుషి’ (Khushi)చిత్రంలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తోంది.
 

click me!