బ్యాన్‌కి గురైన సంచలనాత్మక ఇండియన్‌ సినిమాలు.. వీటిని పిల్లలు అస్సలు చూడకూడదు..

First Published Feb 12, 2021, 3:39 PM IST

కొన్ని సంచలనాత్మకమైన చిత్రాలను కేంద్ర సెన్సార్‌ బోర్డ్ బ్యాన్‌ చేసింది. సెక్స్ కంటెంట్‌, అసభ్య పదజాలం, డ్రగ్స్ వాడకం, జెండర్‌ టాబూస్‌, మతాలను కించపరిచే సన్నివేశాలు ఉండటం, ఇలా తప్పుడు దారిపట్టించే కంటెంట్‌ ఉన్న సినిమాలను బ్యాన్‌ చేసింది. అందులో `గాండు`, `బండిట్‌ క్వీన్‌`, `వాటర్‌`, `కామసుత్ర` వంటి సినిమాలున్నాయి. ఎందుకు బ్యాన్‌ అయ్యాయో తెలుసుకుందాం. 

బెంగాలీలో రూపొందించిన చిత్రం `గాండు`(2010). క్వీ దర్శకత్వం వహించిన ర్యాప్‌మ్యూజికల్‌ చిత్రమిది. ఇందులో ఓరల్‌ సెక్స్ సన్నివేశాలు, నగ్నత్వం ఎక్కువుగా ఉంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపొందిన ఈసినిమా భారతీయ సెన్సిబులిటీస్‌ని అతిక్రమించినందుకుగానూ బ్యాన్‌ చేశారు. ఫ్యామిలీతో చూడలేని చిత్రమిది.
undefined
`బందిత్‌ క్వీన్‌`(1994). మాజీ బందిపోటు, రాజకీయ నాయకురాలు పూలన్‌ దేవి జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. బందిపోటుగా మారడానికి కారణమేంటి అనే కోణంలో, సెక్స్‌ వల్‌ కంటెట్‌, న్యూడిటి, అసభ్య పదజాలంతో శేఖర్‌ కపూర్‌ ఈ సినిమాని రూపొందించారు. దీన్ని కేంద్రం బ్యాన్‌ చేసింది. ఇది కూడా పిల్లలతో కలిసి పేరెంట్స్ చూడలేరు.
undefined
దీపా మెహతా రూపొందించిన `ఫైర్‌`(1996) చిత్రం కూడా ఈ జాబితాలోకి చేరింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రశంసలందుకుంది. హిందూ కుటుంబంలోని ఇద్దరు లెస్బియన్‌ సోదరీమణుల మధ్య సంబంధాన్ని చూపించేదిగా ఉంది. దీన్ని అనేక హిందుత్వ సంస్థలు వ్యతిరేకించాయి. దీంతో బ్యాన్‌ చేశారు.
undefined
దీపా మెహతా రూపొందించిన మరో సినిమా `వాటర్‌`(2005) కూడా బ్యాన్‌కి గురైంది. భారతీయ వితంతువు జీవితంపై రూపొందించిన ఈ సినిమా అనేక వివాదాలను ఎదుర్కొంది. వారణాసిలోని ఓ ఆశ్రమం ని ఆధారంగా చేసుకుని అనురాగ్‌ కశ్యప్ ఈ కథ రాశారు. చివరికి ఇండియాలో బ్యాన్‌ అయ్యింది.
undefined
`సిన్స్` చిత్రం కూడా 2005లో బ్యాన్‌ అయ్యింది. ఇంది కేరళాకి చెందిన ఓ పూజారి ఓ మహిళాతో శృంగారంలో పాల్గొనే కంటెంట్‌తో రూపొందించిన చిత్రమిది. హిందూవులు, కేథలిక్‌లకు మనోభావాలను దెబ్బతీసేదిగా ఉన్న ఈ సినిమాపై అనేక విమర్శలు వచ్చిన నేపత్యంలో బ్యాన్‌ చేశారు.
undefined
`ఫిరాక్‌` అనే సినిమా సైతం 2008లో బ్యాన్‌ అయ్యింది. గుజరాత్‌ అల్లర నేపథ్యంలో దర్శకురాలు నందితా దాస్‌ దీన్ని రూపొందించారు. హిందువులు, ముస్లింల మనోభావాలను దెబ్బతీసేదిగా ఈ సినిమా ఉందనే విమర్శలు వచ్చాయి. దీంతో సినిమాని బ్యాన్‌ చేశారు. చాలా రోజుల తర్వాత విడుదలై ప్రశంసలందుకుంది.
undefined
గుజరాత్‌ అల్లర్లపై 2005లో వచ్చిన మరో చిత్రం `పర్జానియా` కూడా బ్యాన్‌ అయ్యింది. గుజరాత్ అల్లర్లలో తప్పిపోయిన అజార్‌ అనే బాలుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది ఆ సమయంలో బ్యాన్‌ అయినా తర్వాత విడుదలైంది. ప్రశంసలందుకోవడమే కాదు, జాతీయ అవార్డుని గెలుచుకుంది.
undefined
అనురాగ్‌ కశ్యప్‌ రూపొందించిన `బ్లాక్‌ ప్రైడే`(2004) కూడా బ్యాన్‌ అయ్యింది. ముంబయి బాంబ్‌ బ్లాస్ట్ పై రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేశారు. తర్వాత దీన్నొక చీకటి చిత్రంగా భావించారు.
undefined
అనురాగ్‌ కశ్యప్‌ రూపొందించిన మరో సినిమా `పాంచ్‌`(2003) కూడా బ్యాన్‌ అయ్యింది. ఇది జోషి అభ్యాంకర్‌ సీరియల్‌ మర్డర్స్ నేపథ్యంలో రూపొందించారు. అధిక హింస, క్రాస్‌ లాంగ్వేజ్‌, మితిమీరిన డ్రగ్స్ సన్నివేశాలు చూపించడం కారణంగా సినిమాని బ్యాన్‌ చేశారు.
undefined
ఇండియన్‌ హిస్టారికల్‌ ఏరోటిక్‌ చిత్రం `కామసుత్ర`(1996)ని కూడా బ్యాన్‌ చేశారు. ఈ సినిమా విడుదలై వివాదాలు క్రియేట్‌ చేసింది. దేశ వ్యాప్తంగా దీనిపై అనేక వివాదాలు వెంటాడటంతో సినిమాని ఇండియాలో బ్యాన్‌ చేశారు. ఈ సినిమాలతోపాటు మరికొన్ని చిత్రాలు బ్యాన్‌కి గురయ్యాయి. కానీ సంచలనాత్మక చిత్రాలుగా నిలిచాయి. అయితే వీటిని పిల్లలు, పెద్దలు కలిసి అస్సలు చూడలేదు. పిల్లలు చూసేందుకు అస్సలు అవకాశం లేదు.
undefined
click me!