ఇది మా సౌత్‌ మూవీ అని గర్వంగా చెప్పుకుంటాం.. `సలార్‌` రిజల్ట్ పై శృతి హాసన్‌ సంచలన స్టేట్‌మెంట్‌..

First Published Dec 23, 2023, 9:13 PM IST

ప్రభాస్‌, శృతి హాసన్‌ జంటగా నటించిన `సలార్‌` మూవీ థియేటర్ల రచ్చ చేస్తుంది. సంచలనాల దిశగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిజల్ట్ పై శృతి హాసన్‌ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 
 

ఇప్పుడు సినిమాల పరంగా ఎక్కడ విన్నా `సలార్‌` అనే పేరే వినిపిస్తుంది. సినీ లవర్స్ అంతా `సలార్‌` పేర స్మరిస్తున్నారు. ఇంతగా ఈ మూవీ ప్రభావితం చేస్తుంది. ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత డార్లింగ్‌ ప్రభాస్‌ నుంచి వచ్చిన అసలైన మాస్‌, యాక్షన్‌ మూవీ కావడంతో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్‌ కటౌట్‌కి తగ్గ సినిమా పడటంతో సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

ఇదిలా ఉంటే ఈ సినిమా ఫలితంపై తొలిసారి రియాక్ట్ అయ్యింది హీరోయిన్‌ శృతి హాసన్‌. ఇందులో ప్రభాస్‌కి జోడీగా శృతి హాసన్‌ నటించింది. ఆద్య పాత్రలో నటించింది. ఆమె విదేశాల నుంచి ఇండియాకి రాకతోనే సినిమా కథ ప్రారంభమవుతుంది. మలుపు తిరుగుతుంది. అయితే సినిమాకి ఇప్పుడు పాజిటివ్‌ టాక్‌ వస్తోన్న నేపథ్యంలో తాజాగా శృతి హాసన్‌ స్పందించింది. 

Latest Videos


ఆమె ఓ తెలుగు టీవీ షోలో పాల్గొంది. స్టార్‌ మాలో ఈ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ కోసం చేసిన స్పెషల్‌ ప్రోగ్రామ్‌ `మోస్ట్ అవెటెడ్‌ దావత్‌` కార్యక్రమానికి శృతి హాసన్‌ గెస్ట్ గా వచ్చింది. తనదైన స్టయిల్‌లో సందడి చేసింది. 
 

ఇందులో `సలార్‌` సినిమా ఫలితంపై స్పందించింది. మూవీకి ఇంతటి మంచి స్పందన రావడం పట్ల  చాలా హ్యాపీ ఉన్నట్టు తెలిపింది. ప్రభాస్‌ గురించి చెబుతూ, ఆయన `దావత్‌` అంటేనే ప్రభాస్‌ అని చెప్పింది. ఫస్ట్ షెడ్యూల్‌లో సెట్‌లో నలుగురం ఉంటే ఆయన నాలుగు వందల మందికి సరిపోయే ఫుడ్‌ పంపించారు ప్రశంసలు కురిపించింది శృతి హాసన్‌. ఆయన చాలా కేరింగ్‌ పర్సన్‌ అని తెలిపింది శృతి. 
 

ఈ సందర్భంగా యాంకర్‌ రవి `సలార్‌` సక్సెస్‌ క్రెడిట్‌ అంటే ప్రభాస్‌, శృతి హాసన్‌లకు వెళ్తుందని చెప్పాడు. దీనికి కాదు, ఇది ప్రశాంత్‌ నీల్‌ విజన్‌కి వెళ్తుంది. ఆయన విజన్‌ కోసం తాము కలిశామని తెలిపింది. ఈ సందర్భంగా అదిరిపోయే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు సౌత్‌, నార్త్ అనే తేడాది ఉండేదని, సౌత్‌ని తక్కువగా చూసేవారని ఆమె వెల్లడించింది. 

అంతేకాదు `సలార్‌` సినిమా మన సౌత్‌ వాళ్లం గర్వపడేలా మూవీ అని, ఇవి మన కథలు అని, మన హార్ట్ లో నుంచి వచ్చినవి అని, మన నేల నుంచి వచ్చిన సినిమాలని గర్వంగా చెప్పింది శృతి హాసన్‌. అంతేకాదు ఇప్పుడు మన సినిమా గ్లోబల్‌కి వెళ్లింది. అది `సలార్‌` చేసి చూపించింది అని వెల్లడించింది. దీంతో షో మొత్తం హోరెత్తిపోయింది. 
 

click me!