నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలయ్య (Balakrishna) మూడు పాత్రల్లో నటించిన చిత్రం ‘అధినాయకుడు’. పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాత, తండ్రి, మనవడిగా త్రిపాత్రినభియం చేసి ఆకట్టుకున్నారు. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. బాలయ్య నటకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో ఫ్యాన్స్ ను, సినీ ప్రేక్షకులను అలరించబోతున్నారు.