గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న శ్రీలీలా.. అనుపమా, శాన్విలకు సవాల్‌..

Published : Feb 08, 2023, 07:30 PM IST

`ధమాకా` చిత్రంతో విజయాన్ని అందుకుని జోరు మీదుంది శ్రీలీలా. విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ క్యూట్‌ బ్యూటీ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.   

PREV
15
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న శ్రీలీలా.. అనుపమా, శాన్విలకు సవాల్‌..

`పెళ్లిసందడి`తో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది శ్రీలీలా. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. సినిమా యావరేజ్‌గానే మెప్పించినా ఈ బ్యూటీకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సపోర్ట్ చేయడంతో ఈ బ్యూటీకి మంచి ఊపు వచ్చింది. వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. సక్సెస్‌ జోరులో ఉన్న శ్రీలీలా తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. 
 

25

గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ,  హస్పెటాలిటీ లో నటి శ్రీలీలా మొక్కలు నాటింది. రాజ్యసభ ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీలీలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని శ్రీలీలా తెలిపారు. 
 

35

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో కలిపి ఇప్పటికి 17 కోట్ల మొక్కలు నాటడం గొప్పవిషయమని శ్రీలీలా తెలిపారు. ప్రతిఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 

45

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త ఎంపీ సంతోష్ కుమార్ కి శ్రీలీలా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్స్  శాన్వి శ్రీవాస్తావ్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు తన అభిమానులు మూడు మొక్కలను నాటాలని శ్రీలీలా పిలుపు ఇచ్చారు. 
 

55

ప్రస్తుతం శ్రీలీలా వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలకృష్ణ-అనిల్‌రావిపూడి చిత్రంలో ఆయనకు కూతురు పాత్రలో కనిపించనున్నట్టు టాక్‌. అయితే ఇందులో నిజం లేదని అనిల్‌రావిపూడి చెప్పడం గమనార్హం. దీంతోపాటు మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే నవీన్‌ పొలిశెట్టితో `అనగనగా ఒక రాజు` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `జూనియర్‌`, రామ్‌ బోయపాటి చిత్రంలో నటిస్తుంది శ్రీలీలా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories