`సలార్‌` మరో సాలిడ్‌ లీక్‌.. ప్రభాస్‌ని ఇలా చూసి పండగ చేసుకున్న ఫ్యాన్స్.. గూస్ బంప్స్ స్టఫ్ అంటూ రచ్చ

First Published Nov 10, 2022, 9:07 AM IST

ప్రభాస్‌ సినిమాల అప్‌డేట్‌ ల కంటే లీక్‌లే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా `సలార్‌` సినిమాకి సంబంధించిన లీక్‌లు వెంటాడుతున్నాయి. తాజాగా మరో సీన్‌ లీక్‌ అవ్వడంతోపాటు ఇప్పుడది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 
 

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో `సలార్‌` ఒకటి. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, ప్రభాస్‌ చాలా రోజుల తర్వాత మాస్‌ క్యారెక్టర్‌లో, అత్యంత శక్తివంతమైన రోల్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై ఆది నుంచే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా `కేజీఎఫ్‌` తరహాలో ఉందంటే బాక్సాఫీసు బద్దలైపోవడం ఖాయమనే టాక్‌ ఇప్పటి నుంచే వినిపిస్తుంది. 
 

అంచనాలు, ఊహలు ఈ రేంజ్‌లో ఉంటే, అందుకు తగ్గట్టు లీక్‌లు కూడా అదే రేంజ్‌లో ఉండటం గమనార్హం. ఈ సినిమాని ప్రారంభం నుంచి లీక్‌లు వెంటాడుతున్నాయి. షూటింగ్‌ ప్రారంభంలోనే కోల్‌ మైనింగ్‌లో బైక్‌పై ఉన్న ప్రభాస్‌ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ తర్వాత చాలా లీక్‌లు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా వీడియో క్లిప్పే బయటకు వచ్చింది. షూటింగ్‌ సమయంలో యూనిట్‌లో ఒకరు సీక్రెట్‌గా తీసిన వీడియో క్లిప్‌ అది. దాదాపు పది సెకన్ల పాటు ఉండటం విశేషం. 
 

ఇందులో షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్‌ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇందులో జోవియల్‌గా ఓ విషయాన్ని వెల్లడిస్తున్నారు ప్రభాస్‌. ఆయన చెప్పేది అంతా సీరియస్‌గా వింటున్నట్టుగా ఉంది. ఆడియో లేదు గానీ, వీడియో క్లిప్‌ మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది. మాస్‌ జాతరకిది పర్‌ ఫెక్ట్ పిక్చర్‌ అనేలా ఈ లీక్‌ వీడియోలో ప్రభాస్‌ లుక్‌ ఉండటం విశేషం. 

ఇందులో కార్మికుడి డ్రెస్‌లో కనిపిస్తున్నారు ప్రభాస్‌. ఇది చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గూస్‌బంమ్స్ స్టఫ్‌ అంటున్నారు. `సలార్‌` నుంచి సాలిడ్ లీక్‌ అంటూ డార్లింగ్‌ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 
 

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రభాస్‌కి సంబంధించి మూడు పోస్టర్లని మాత్రమే రిలీజ్‌ చేసింది. రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్ చేశారు. కానీ అంతకు మించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. సినిమా ఎంత వరకు వచ్చింది. ఏం జరుగుతుంది. సినిమా ఎలా ఉండబోతుందనే విషయాలన్నీ పూర్తిగా సస్పెన్స్ గా మెయింటేన్‌ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్. 

`సలార్‌` అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. చిన్న వీడియో క్లిప్‌ ఇవ్వండని, గ్లింప్స్ లాంటిది రిలీజ్‌ చేయాలని కోరుతున్నా టీమ్‌ రియాక్ట్ కాలేదు. కానీ ఈ లీక్‌లు మాత్రం ప్రభాస్‌ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. మొత్తానికి వాళ్లు ఈ లీక్‌లతో హ్యాపీ అవుతున్నారని చెప్పొచ్చు. 

ఇక కార్మిక నాయకుడి పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్న `సలార్‌` చిత్రం `కేజీఎఫ్‌`కి నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని సమాచారం. ఇందులో ప్రభాస్‌కి జోడీగా శృతి హాసన్‌ నటిస్తుండగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా చేస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
 

వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో సినిమాని రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం వాయిదా పడే ఛాన్స్ ఉందట. 2024కి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది  తెలియాల్సి ఉంది. 
 

click me!