డెనిమ్ జీన్స్ లో నిధి హాట్ హాట్ థైస్ షో... మీ మైండ్ బ్లో అయితే ఆమె తప్పు కాదు!

First Published Aug 8, 2021, 8:02 PM IST


మగువలను చూస్తే బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెలుగులు అనేది సామెత. ఆడవారి అందాలు చూస్తే సృష్టించిన బ్రహ్మకు కూడా మతి చెడుతుంది అనేది దానర్ధం. ఈ సామెత బహుగా నిధి అగర్వాల్ లాంటి హాట్ భామలను చూసే పుట్టి ఉంటుంది. 
 

మగవాళ్ల గుండె పిండేసే నిధి అందాలు వర్ణించడం ఏమంత సులభం కాదు. క్రింద నుండి పైకి అనువైన కొలతలతో పోతపోసినట్లు ఉండే నిధి సోకులకు బానిసలు ఎందరో. 


గ్లామర్ తోనే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న నిధి ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ కోసం ఆబగా ఎదురు చూసే, రసిక శిఖామణులు చాలా మంది ఉన్నారు. 

దానికి ఆమె సోషల్ మీడియా ఫాలోయర్స్ నిదర్శనం. మిలియన్స్ లో ఉన్న నిధి అగర్వాల్ ఫాలోవర్స్ క్రమం తప్పకుండా ఆమె ఫోటోలకు లైక్స్ కొడతారు. కామెంట్స్ పెడతారు. 

ఇక హీరోయిన్ గా ఆమె కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో హరి హర వీరమల్లు లాంటి భారీ పాన్ ఇండియా మూవీ ఉంది. 

పవన్ లాంటి స్టార్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ విజయం సాధిస్తే నిధి రేంజ్ మరో స్థాయికి చేరుతుంది. 

అలాగే ఓ తమిళ చిత్రం చేస్తున్న నిధి, మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ హీరో లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన హీరో మూవీ టీజర్ ఆకట్టుకుంది. 

కెరీర్ బిగినింగ్ లో నిధి సరైన విజయాలు లేక ఇబ్బంది పడ్డారు. పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో ఆమె క్లీన్ హిట్ అందుకున్నారు. 

ఇస్మార్ట్ శంకర్ తరువాత నిధి ఈశ్వరన్, భూమి అనే రెండు తమిళ చిత్రాలు చేశారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రెండు చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. 


హైదరాబాద్ కి చెందిన నిధి భవిష్యత్ మాత్రం బాగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. గ్లామర్ హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు దక్కే అవకాశం కలదు. 


వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే నిధి గ్లామర్ షో అధికం అని చెప్పాలి. పొట్టి డ్రెస్ లలో నిధి అగర్వాల్ అందాలు విందు సూపర్ ఫేమస్. 

ముఖ్యంగా డెనిమ్ షార్ట్స్ లో నిధి థైస్, నడుము చూపిస్తూ ఇచ్చే కిరాక్ పోజులు చాలా పాప్యులర్. బహుశా డెనిమ్ షార్ట్స్ లో మరో హీరోయిన్ ఇంత హాట్ గా ఉండదేమో అన్నట్లు ఉంటుంది నిధి. 


ఇక కెరీర్ బిగినింగ్ లోనే నిధి పై ఎఫైర్ రూమర్స్ రావడం జరిగింది. క్రికెటర్ కె ఎల్ రాహుల్ తో నిధి ఎఫైర్ నడిపినట్లు వార్తలు రావడం జరిగింది. 

click me!