సైమా అవార్డ్స్ 2021: మహేష్, నాని, రష్మిక వంటి స్టార్స్ తో మెరిసిన వేదిక...అవార్డ్స్ గెలుపొందిన నటీనటులు వీరే!

First Published Sep 19, 2021, 12:15 PM IST

భాగ్యనగరం సినీ తారల కాంతులలో మెరిసిపోయింది. సైమా 2021 వేడుకకు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ శనివారం రాత్రి కొత్త కళను సంతరించుకుంది. 


సూపర్ స్టార్ మహేష్ సైమా వేదికపై పున్నమి చంద్రుడిలా మెరిసిపోయారు. మహర్షి సినిమాకి గాను ఆయన ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును గెలుచుకున్నారు. 

 2019 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్ర ప్రముఖులను సైమా అవార్డ్స్ తో సత్కరించారు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ జెర్సీ సినిమాకి గానూ ఉత్తమ చిత్రం (తెలుగు) అవార్డును అందుకున్నారు. 

బ్యూటీ రష్మిక మందాన సైమా 2021 అవార్డ్స్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డియర్ కామ్రేడ్ చిత్రానికి ఉత్తమ నటిగా - క్రిటిక్స్ (తెలుగు) అవార్డు ఆమె గెలుచుకుంది. 

యువ హీరో కార్తికేయ గుమ్మకొండ 2019 లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమాలోని నటనకు గాను  ఉత్తమ నటుడు నెగటివ్ రోల్ (తెలుగు) అవార్డును గెలుచుకున్నాడు


నటుడు అజయ్ ఘోష్  రాజు గారు గాది 3 చిత్రానికి గానూ ఉత్తమ నటుడు కామెడీ రోల్ (తెలుగు) అవార్డు కైవసం చేసుకున్నారు. 


దర్శకుడు అనిల్ రావిపూడి F2 సినిమాకి గానూ, ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫ్ ది ఇయర్ (తెలుగు) అవార్డు గెలుచుకోవడం జరిగింది. 


జెర్సీ & నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉత్తమ నటన కనబరిచిన హీరో నాని  ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ (తెలుగు) అవార్డును అందుకున్నారు. 

2019 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్ర ప్రముఖులను సైమా అవార్డ్స్ తో సత్కరించారు. అల్లరి నరేష్ మహర్షి సినిమాకి గాను ఉత్తమ సహాయ నటుడు (తెలుగు) అవార్డు గెలుపొందారు. 


మత్తు వదలరా సినిమాతో హీరో ఎంట్రీ ఇచ్చిన  శ్రీ సింహ ఉత్తమ నూతన నటుడు (తెలుగు) అవార్డు గెలుచుకున్నారు. 


స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద మజిలీ చిత్రంలోని  ప్రియతమా ప్రియతమా .. పాటకు ఉత్తమ నేపథ్య గాయని (మహిళా) (తెలుగు) అవార్డు అందుకున్నారు. 

మహర్షి సినిమాలోని 'ఇదే కథ' పాటకు సాహిత్యం అందించిన శ్రీమణి ఉత్తమ లిరిక్ రైటర్ (తెలుగు) అవార్డు అందుకున్నారు.

click me!