''పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్దం... నీ రాజకీయాల కోసం బలహీనుల జీవితాలతో ఆటలా చంద్రబాబు..!''

By Arun Kumar PFirst Published May 7, 2024, 1:10 PM IST
Highlights

ప్రజాసేవ చేయాల్సిన రాజకీయ నాయకుడే పదవీ మోహంతో పేదల కడుపు కొడుతున్నాడంటూ టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసిపి నాయకులు మండిపడుతున్నారు. పేదల జీవితాలతో ఆటలేంటి బాబు? అని ప్రశ్నిస్తున్నారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచిన పేదలకు... ప్రతిపక్ష కూటమి పెత్తందార్ల మద్యే అని వైసిపి చెబుతూవస్తోంది. ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళుతోంది జగన్ పార్టీ. అయితే ఇదేదో ప్రాసకోసమో, రాజకీయ లబ్ది కోసమో చేస్తున్న కామెంట్స్ కావు... నిజంగానే చంద్రబాబు పెత్తందారి పోకడలను ప్రజలకు వివరించే ప్రయత్నమని వైసిపి నాయకులు అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలకు మరోసారి బడుగు బలహీనవర్గాలు, పేదలు బలి అవుతున్నారని వైసిపి అంటోంది. ఎలక్షన్ కోడ్ ను అడ్డం పెట్టుకుని టిడిపి నేతల ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నారని... దీంతో పేద ప్రజలు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఇది చంద్రబాబు పెత్తందారి పోకడటకు నిదర్శనమని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు నాయుడు వాలంటీర్ సేవలను అడ్డుకున్నాడు.. దీంతో ఈనెల పెన్షన్ డబ్బుల కోసం వృద్దులు, వికలాంగులు నానా అవస్థలు పడ్డారు. ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటికివచ్చి మరీ పెన్షన్ డబ్బులు అందించేవారు వాలంటీర్లు ... కానీ టిడిపి ఫిర్యాదు కారణంగా ఈసారి పెన్షన్ ను బ్యాంకుల ద్వారా అందించాలని ఈసీ ఆదేశించింది. దీంతో నడవలేని అవ్వాతాతలు, అంగవైకల్యంతో బాధపడుతున్న వికలాంగులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఎన్నో అవస్థలు పడితేగానీ పెన్షన్ డబ్బులు చేతికందలేదు. దీనికి కారణమైన చంద్రబాబు, ప్రతిపక్ష కూటమిపై ఇప్పటికే ప్రజలు గుర్రుగా వున్నారని వైసిపి నాయకులు చెబుతున్నారు. 

అయితే ఇప్పుడు చంద్రబాబు మరోసారి పేదలపై జులుం ప్రదర్శిస్తున్నాడని వైసిపి నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెన్షన్ పంపిణీని అడ్డుకున్నట్లే మిగతా సంక్షేమ పథకాలను కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నాడని అంటున్నారు. ఎన్నికల వేళ లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించకూడదని ఈసికి ఫిర్యాదులు చేయించాడు చంద్రబాబు... దీంతో ఈసీ వాటిని నిలిపి వేసిందని వైసిపి నాయకులు వాపోతున్నారు. 

తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు పేదల జీవితాలతో ఆడుకుంటున్నాడని వైసిపి నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలు పథకాలను ప్రజలకు అందకుండా అడ్డుకున్న చంద్రబాబు మరిన్ని పథకాలను అడ్డుకునే కుట్రలు చేస్తున్నాడని అంటున్నారు. ఇలా వైఎస్ జగన్ పేదలకోసం ఏదో చేయాలని తపిస్తే... చంద్రబాబు మాత్రం వారిపై పగబట్టాడని అంటున్నారు. అందుకే ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్నాయని అంటున్నామని వైసిపి నాయకులు చెబుతున్నారు. 

జగన్ సర్కార్ విద్యార్ధుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యాదీవెన వంటి పథకాలను అమలుచేస్తోంది. అలాగే ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయే రైతులకు ఇన్ పుట్ సబ్సిడి అందిస్తోంది. ఇందుకు సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్దమవగా చంద్రబాబు అడ్డుకుంటున్నాడట. ఈ పథకాల గురించి ఈసికి ఫిర్యాదు చేయడంలో ప్రజలవద్దకు చేరకుండానే నిధులు నిలిచిపోయాయి. ఇలా పేదల జీవితాలతో ఆటలాడుకుంటూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని వైసిపి మండిపడుతోంది. 

చంద్రబాబు తమ కడుపు ఎలా కొడుతున్నాడో ప్రజలకు అర్థమయ్యింది... కాబట్టి అతడిని తరిమేసేందుకు సిద్దమయ్యారు... ఆ రోజులు కూడా అసన్నమయ్యాయని వైసిపి శ్రేణులు అంటున్నాయి. కేవలం ఒక్క నెల ఓపిక పడితే మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుంది... మళ్ళీ పేదలు జీవితాల్లో వెలుగులు నిండుతాయని వైసిపి నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

click me!