రెడ్ కార్పెట్ పై మెరిసిన ఆల్ట్రా స్టైలిష్ ఏంజెల్... నడుము మడతలు, నాభి సొగసులు చూపిస్తూ కాకపుట్టించిన శృతి!

First Published Sep 19, 2021, 3:40 PM IST


ప్రముఖ సినిమా అవార్డ్స్ సైమా 2021 కి హైదరాబాద్ వేదిక కాగా, పలు పరిశ్రమలకు చెందిన తారలు తళుక్కున మెరిశారు. తేనెకళ్ల శృతి హాసన్ ఈ ఈవెంట్ కి హాజరు కాగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 


బ్లాక్ డిజైనర్ వేర్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఏంజెల్ లా దర్శనం ఇచ్చిన శృతి, రెడ్ కార్పెట్ పై హొయలు పోతూ, ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. 

ఓ వైపున స్లీవ్ లెస్ అందాలు, మరోవైపు నడుము మడతలు, నాభి సొగసులు చూపిస్తూ.. కాకపుట్టించగా, వీక్షకులకు చెమటలు పట్టాయి. 

ఇక సైమా అవార్డ్స్ వేడుకకు శృతి చెల్లెలు అక్షరా హాసన్, బంధువు అయిన నటి సుహాసిని సైతం హాజరయ్యారు. ఫోటోగ్రాఫర్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించిన శృతి, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. 

మరోవైపు నెమ్మదించిన కెరీర్ క్రాక్, వకీల్ సాబ్ వంటి హిట్ చిత్రాలతో ఊపందుకోగా, సలార్ వంటి భారీ చిత్రంలో అవకాశం కొట్టేసింది. సలార్ మూవీలో ఏకంగా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. 

కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ కూడా మొదలైపోయింది. మొదటి షెడ్యూల్ తెలంగాణా రాష్ట్రంలోని గోదావరి ఖని ఏరియాలో గల మైనింగ్ ప్రాంతంలో నిర్వహించారు. ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. 

అలాగే ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో శృతి డేటింగ్ చేస్తున్నారు. సెకండ్ వేవ్ లాక్ డౌన్ కి ముందు మొదలైన ఈ ప్రేమ కహాని రోజు రోజుకు బలంగా మారుతుంది. 

ముంబైలో వీరిద్దరూ కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. విందులు, వినోదాలు, సంబరాలు జరుపుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. హజారికను శృతి ఎంతో ప్రేమిస్తున్నట్టు స్పష్టంగా ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ లలో అర్థం అవుతుంది.

మొదటి లవర్ మైఖేల్ కోర్స్లే తో బ్రేకప్ తరువాత కొంత డిప్రెషన్ కి గురైన శృతి హాసన్ ని హజారిక పరిచయం సంతోషంగా మార్చింది. శృతి, హజారిక మోస్ట్ లవింగ్ కపుల్ గా తరచూ వార్తలలో నిలుస్తున్నారు. 

click me!