`కొత్తబంగారు లోకం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది స్వేత బసు ప్రసాద్(Shweta Basu Prasad). టీనేజ్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించి ఆకట్టుకుంది. కుర్రాళ్ల హార్ట్ ని కొల్లగొట్టింది. ఈ సినిమా చూసి స్టూడెంట్స్ అంతా ఇలాంటి లవ్ స్టోరీలను ఫాలో అయ్యారంటే ఈ మూవీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఈ చిత్రంతో అటు వరుణ్ సందేశ్, స్వేత బసు ప్రసాద్ ఓవర్‌నైట్‌లో స్టార్స్ అయిపోయారు. విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లో రచ్చ చేశారు. బెస్ట్ పెయిర్‌గానూ నిలిచిందీ జంట. ఆ తర్వాత స్వేత పలు విజయాలు అందుకుంది. `రైడ్`, `కాస్కో`, `కలవర్ కింగ్` చిత్రాల్లో మెరిసింది. `రైడ్` మంచి విజయం సాధించింది.
వరుణ్ సందేశ్‌తోనే `ప్రియుడు` చేసింది. సక్సెస్ రాలేదు. `జీనియస్` చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసింది. పెద్దగా ఉపయోగపడలేదు. అటు హిందీలోకి వెళ్లి ప్రయత్నాలు చేసింది. అక్కడ బాగానే ఆఫర్లని అందుకుంది. సక్సెస్ ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది.
దీంతో కొన్ని తప్పటడుగులు వేసింది. బోల్తా పడింది. అనేక ఆరోపణలు ఎదుర్కొంది. కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఏం జరిగిందో ఏమో స్వేత బసు ప్రసాద్‌పై దారుణమైన నింద పడింది. దీంతో ఎంతో కుంగిపోయింది. ఎన్నో అవమానాలను ఫేస్ చేసింది.
వాటిని ధైర్యంగా ఎదుర్కొంది. ఈ ఎదుర్కొనే సమయంలోనే అనేక అవరోదాలు, అడ్డుంకులు ఫేస్ చేసింది. తనపై పడ్డ నిండని చెరిపేసుకునే ప్రయత్నం చేసింది. స్వేత బసు ప్రసాద్‌పై వ్యభిచార ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తో దొరికిపోయిందన్నారు.
కానీ జరగరాని నష్టం జరిగింది. స్వేత బసు ప్రసాద్ హీరోయిన్ కెరీర్ కి పెద్ద బ్రేక్ పడింది. దీంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మళ్లీ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఓటీటీ ఫిల్మ్స్ చేస్తూ రాణిస్తుంది. వెబ్‌సిరీస్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.సినిమా ఆఫర్లు లేకపోవడంతో వచ్చిన ఆఫర్లని సద్వినియోగం చేసుకుంటుంది.
సోషల్ మీడియాలోనూ జోరు పెంచిందీ భామ. తన గ్లామర్ ఫోటోలతో పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు, సోషల్ మీడియా ఫ్యాన్స్ ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇటీవల ఈ బ్యూటీ మంచి హిందీలో `ఇండియా లాక్‌డౌన్` చిత్రంలో నటించి మెప్పించింది.
అలాగే `జుబ్లీ` అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. నటిగా తనకంటూ గుర్తింపు కోసం ట్రై చేస్తుంది, కానీ అవకాశాలు రావడం లేదు. దీంతో స్ట్రగుల్ అవుతుందీ అందాల భామ. గ్లామర్ ట్రీట్‌తో అదరగొడుతుంది.
తాజాగా జాకెట్ వేసుకోకుండా రెచ్చిపోయింది. బ్లాక్ బ్రాలో ఎద పరువాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. క్రేజీగా పోజులిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
`కొత్త బంగారు లోకం`తో బంగారు కెరీర్‌ని అందుకున్న ఈ బ్యూటీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. అవకాశాలను ఎంచుకోవడంలో, జీవితంలో చేసిన కొన్ని పొరపాట్లు ఈ అమ్మడి జీవితాన్ని రాంగ్ ట్రాక్ పట్టించాయి. ఒక్కసారి సినిమా రంగంలో నెగటివ్ ఇమేజ్ పడితే కోలుకోవడం కష్టం. ఇప్పుడు స్వేత బసు ప్రసాద్ అదే ఫేస్ చేస్తుంది. కానీ అధైర్యపడకుండా తనవంతుగా కృషి చేయడం విశేషం. మరి ఈ బ్యూటీ మళ్లీ నటిగా కమ్ బ్యాక్ అవుతుందా? ఆడియెన్స్ ని మెప్పిస్తుందా అనేది చూడాలి.